
బహిరంగ మార్కెట్‌లో పంచదార ధరకు రెక్కలొచ్చాయి. డిమాండ్‌ పెరగడంతో కేజీ రూ.70కి పైగా పలుకుతోంది. నాణ్యతను బట్టి రూ. 80 వరకు విక్రయిస్తున్నారు. ఇదే అదునుగా చౌక దుకాణాల్లో దందాకు తెరలేపారు. కార్డుదారులకు అర కేజీ చొప్పున పంపిణీ చేయాల్సిన పంచదారను పక్కదారి పట్టిస్తున్నారు. కార్డుదారులు ఎవరైనా ప్రశ్నిస్తే ఈనెల కోటా తక్కువగా వచ్చిందని, ముందొచ్చిన వారికి ఇచ్చేశామంటూ మాయమాటలు చెప్పి తప్పించుకుంటున్నారు. మరిన్ని వివరాలకు..




