
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో హౌస్మేట్స్ మధ్య రోజురోజుకూ సరికొత్త వివాదాలతో రసవత్తరంగా సాగుతుంది. నిన్నటివరకు నామినేషన్స్ రచ్చ నడవగా.. మరోవైపు క్యూట్ లవ్ స్టోరీ పట్టాలెక్కింది. సెప్టెంబర్ 15 నాటి ఎపిసోడ్లో కంటెస్టెంట్ దేబ్జానీ మోదక్, ముకేష్ గౌడ మధ్య జరిగిన చిన్నపాటి సరదా గొడవ ఎపిసోడ్ కే హైలెట్ కగా.. దెబ్జానీ మాటలు.. ముఖేష్ సంజాయిషీ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. గత వీకెండ్ ఎపిసోడ్లో హోస్ట్ నాగార్జున ముందే ముఖేష్‌పై తనకున్న ఇష్టాన్ని బయటపెట్టిన దేబ్జానీ, ఈ ఎపిసోడ్‌లోనూ అతడితో చాలా ఫన్నీగా, క్యూట్‌గా ఫ్లర్ట్ చేస్తూ సందడి చేసింది. తనకు వచ్చిన కొంచెం కొంచెం తెలుగుతో అటు హౌస్మేట్స్, ఇటు అడియన్స్ ను ఆకట్టుకుంటుంది ఈ సీరియల్ భామ. ఇక నిన్నటి ఎపిసోడ్ లో వర్షిణితో కలిసి పూల్ లో సందడి చేసిన ముఖేష్ ను ఓ ఆటాడుకుంది దెబ్జానీ.