
మీకు ఇప్పటికీ జయంతి గారంటే ఇష్టమా? అని చక్రి అడుగుతాడు. ఇష్టం ఏంటి.. ప్రాణం.. ప్రేమ, ఇష్క్, కాదల్.. అన్నీ.. నాకు ఎవ్రీథింగ్.. కానీ తనకే నేను ఇప్పుడు నథింగ్ అని అంటాడు శేఖర్. మరి ఇప్పుడు వెళ్లి చెప్పొచ్చు కదా అని చక్రి అంటే.. అది నా మాట వింటుందా? చూశావ్ కదా.. అసలు ఎవరైనా ఇలా ఎంగేజ్మెోంట్కి భర్తను పిలుస్తారా? అని శేఖర్ బాధ పడుతుంటాడు. అవును, పిలవరు అని చక్రి కూడా మాటలు కలుపుతుంటాడు. అది ఎప్పుడూ నా మాట వినలేదు అని శేఖర్ అంటాడు. అయినా తప్పంతా నాదే.. నేనే అలా చేసి ఉండ కూడదు.. భార్య.. భరించే వరకే భర్త.. ఒక్కసారి వదిలేసి వెళ్తే విలువే ఉండదు అని శేఖర్ బాధ పడుతుంటాడు. మరి మీ ఆవిడకి వెళ్లి నీ ప్రేమ గురించి చెప్పుకోవచ్చు కదా.. అని అంటాడు చక్రి. నా మాట వింటుందా? అని శేఖర్ అంటే.. నా ప్లాన్ ప్రకారం వెళ్తే వర్కౌట్ అవుతుంది అని చక్రి అంటాడు. అవునా చెప్పు.. నువ్వు చెప్పినట్టే చేస్తా అని శేఖర్ అంటాడు. ఇక చక్రి ఏదో ప్లాన్ ఇస్తాడు. ఆ ప్లాన్ అంతా వింటాడు శేఖర్. ఇక అందరూ ఎంగేజ్మెంట్ స్టేజ్ మీద కూర్చుంటారు. ఎంగేజ్మెంట్ సాఫీగా సాగుతూ ఉంటుంది. మీ ప్లాన్ ఏమైంది.. అసలు మీరు నిజంగా తల్చుకుంటే ఈ ఎంగేజ్మెంట్ ఆపడం ఒక లెక్కా అని మహా అంటుంది. ఏంటండి అలా అంటారు అని చక్రి అంటే.. మీరే కదా ఆ జుట్టు పోలిగాడితో పెళ్లి ఆపించారు అని మహా అంటుంది. ఇప్పుడు కూడా నా ప్రయత్నం చేశా.. అతడికి చెప్పాల్సింది చెప్పా.. అతను వచ్చి ఆపుతాడా? లేదా? ఈ ఎంగేజ్మెంట్ జరుగుతుందా? లేదా? అన్నది చూడాలి. ఆమె మన ఇంటికి రావాలని రాసి పెట్టి ఉంటే ఎవ్వరూ మార్చలేరేమో అని చక్రి అంటాడు. తాంబూలాలు మార్చుకోడానికి మీ సైడ్ ఎవరున్నారు? అని పంతులు అడుగుతాడు. నాకు భార్య లేదు.. నా చెల్లికి భర్త లేడు అని నారాయణ అంటాడు. దుబాయ్లో ఉన్నాడు అని తాయారు అంటుంది. మా ఆయన ఊర్లో లేడు అని గాయత్రి.. నాకు ఇంకా పెళ్లి కాలేదు అని మనీషా అంటుంది. మీ ఇద్దరూ భార్యభర్తలే కదా అని చక్రి, మహాని అడుగుతాడు పంతులు. అవును మేం భార్యాభర్తలమే అని చక్రి అంటే ఈ పాపంలో నేను కూడా పాలు పంచుకోవాలా? అని మహా అంటుంది. కచ్చితంగా జంట ఉండాల్సిందేనా అని నారాయణ అడుగుతాడు. లక్ష్మీ నారాయణుడిలా ఈ జంట ఉంది కదండి అని చక్రి, మహాని తీసుకోమని పంతులు అంటాడు. చివరి సారిగా అడుగుతున్నా.. ఒక్కసారి ఆలోచించుకోండని జయంతి నాన్న అంటాడు. పెద్ది మాత్రం సమ్మతమే అంటాడు. జయంతి కూడా నాకు ఇష్టమే అని చెప్తుంది. ఇక ఈ ఎంగేజ్మెంట్ని ఎవ్వరూ ఆపరా? అని నారాయణ బాధ పడుతుంటాడు. తాంబూలాలు కూడా మార్చుకుంటాడు. డ్రెస్సులు మార్చుకుని రమ్మని జయంతి, మాధవకు పంతులు చెప్తాడు. ఆ ఇద్దరూ లోపలకు వెళ్లిపోతారు. కాసేపటి పెద్ది బయటకు వస్తాడు. నాన్నా.. ఇటు రండి.. మీతో ఓ విషయం చెప్పాలి.. ఈ ఎంగేజ్మెంట్ జరగడం లేదు అని జయంతి చెబుతుంది. ఎందుకు అలా నిర్ణయం మార్చుకున్నావ్ అని జయంతి తండ్రి అడుగుతాడు. ఇక జయంతి చెప్పిన మాటలకు నారాయణ, కేశవ, కన్నా, మహా, చక్రి, మనీషా ఫుల్ ఖుషీ అవుతారు. మీరు చాలా గ్రేట్ అండి అని చక్రిని పొగిడి చేతిలో చేయి వేసి పట్టుకుంటుంది మహా. దీంతో చక్రి గాల్లో తేలిపోతాడు. నేను నా నిర్ణయం తీసుకున్నాను.. ఈ ఎంగేజ్మ్ంట్ వద్దు.. మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా అని పెద్దితో జయంతి మాట్లాడుతుంది. ఎందుకు ఇలా చేస్తున్నారో తెలుసుకోవచ్చా? అని పెద్ది అడుగుతాడు. ఇంతలో శేఖర్ వస్తాడు. నా వల్లే.. మేం కాంప్రమైజ్ అయ్యాం.. మళ్లీ ఒక్కటి అవుతున్నాం అని శేఖర్ అంటాడు. ఆయన తన తప్పుని తెలుసుకున్నాడు అమ్మ.. నేను మా అత్త ఇంటికి వెళ్తున్నా అని జయంతి అంటుంది. నా వల్లే మీకు అవమానం జరిగింది.. నన్ను క్షమించండి అని నారాయణ కుటుంబానికి దండం పెట్టి వెళ్లిపోతుంది జయంతి. అయ్యో పర్లేదు లే అమ్మా అని నారాయణ అంటాడు. ఇక ఇంతలో జయంతి తండ్రి వచ్చి క్షమించండని అడుగుతాడు. పిల్లల్ని కంటాం కానీ.. వారి రాతల్ని కంటామా? అని నారాయణ డైలాగ్ వేస్తాడు. మీ జయంతి మా ఇంటికి వస్తుందని కలలు కన్నాం అని మహా, జయంతి గారే మా వదినగా వస్తారని మేం ఎంతో అనుకున్నాం అని చక్రి ఇలా అందరూ ఓవర్ చేస్తుంటారు. అందరినీ పెద్ది గమనిస్తుంటాడు. మంచి వాడికి ఎలాంటి వాళ్లు రావాలో.. అలాంటి వాళ్లే వస్తారు అని మనీషా అంటుంది. ఏంటి ఇదంతా ఆమె అలా ఇష్టానికి వెళ్లిపోతే చూస్తూ ఉండాలా? అని తాయారు గొడవ పెడుతుంటుంది. మా అక్క అంతే.. మా అక్కకు నచ్చినట్టే చేస్తుంది అని శశిపాల్ అంటాడు. అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.





