
ఇంటర్నెట్‌ డెస్క్: తమిళ బిగ్‌బాస్‌ 10వ సీజన్‌లో హోస్ట్‌ విజయ్‌ సేతుపతి ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై బిగ్‌బాస్‌ ప్రసారం చేసే ‘స్టార్‌ విజయ్‌’ టీవీ క్లారిటీ ఇచ్చింది. ఆయన మాటలు ఎవరినీ ఉద్దేశించినవి కాదని స్పష్టం చేస్తూ నోట్‌ విడుదల చేసింది. బిగ్ బాస్ (Big Boss 10) రియాలిటీ షో కేవలం వినోదం కోసమేనని పేర్కొంది. ఇందులోని సంభాషణలు ఆ షోకు మాత్రమే పరిమితమని .. వీటిని వర్తమాన వ్యవహారాలతో ముడిపెట్టొద్దని విజ్ఞప్తి చేసింది. అసలేం జరిగిందంటే.. కోలీవుడ్‌ అగ్ర కథానాయకుడు విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) ఈ సీజన్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆయన కంటెస్టెంట్‌ల గేమ్‌ను ఉద్దేశిస్తూ మాట్లాడే క్రమంలో కొన్ని కామెంట్స్‌ చేశారు. ‘సాధ్యం కాని హామీలు ఇవ్వడం, సమస్యల నుంచి తప్పించుకునేందుకు ప్రతిపక్షాన్ని నిందించడం నాయకుడి లక్షణం కాదు’ అని అన్నారు. ఈ కామెంట్స్‌ కోలీవుడ్‌తో పాటు రాజకీయ వర్గాల్లోనూ దుమారం రేపాయి. ఇవి తమిళనాడు సీఎం విజయ్‌ను ( Vijay ) ఉద్దేశించి అన్నారంటూ టీవీకే ( TVK ) పార్టీ నేతలు విజయ్‌ సేతుపతిని విమర్శిస్తున్నారు. తాజాగా ‘స్టార్‌ విజయ్‌’ టీవీ ప్రకటనతో ఈ వివాదానికి ఫుల్‌స్టాప్‌ పడుతుందేమో చూడాలి. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. ఇంటర్నెట్‌ డెస్క్: ముంబయిలోని ముకేశ్ అంబానీ నివాసం ఆంటిలియాలో గణేశ్ చతుర్థి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ప్రతి ఏటా ఆనవాయితీగా నిర్వహించే ఈ వేడుకలకు ఈసారి కూడా సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై సందడి చేశారు. తారల రాకతో అంబానీ నివాస ప్రాంగణంలో పండుగ వాతావరణం మరింత కోలాహలంగా మారింది. ఆ ఫొటోలు మీకోసం మ్యూజిక్‌ డైరెక్టర్‌గా వరుస సినిమాలతో ఆకట్టుకుంటోన్న జీవీ ప్రకాశ్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఇమ్మోర్టల్‌’.





