
జ్యోతి వెలిగిస్తున్న మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ అల్లిపురం, న్యూస్‌టుడే: ఆచార్య ఆత్రేయ 400కు పైగా సినిమాలకు పాటలు, మాటలు రాసిన కవిగా ఖ్యాతి గడించారని మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ అన్నారు. డాబాగార్డెన్స్‌ వద్ద అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఆదివారం ఆచార్య ఆత్రేయ కళాపీఠం ఆధ్వర్యంలో ఆచార్య ఆత్రేయ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ‘ఈనాటి ఈ బంధం ఏనాటిదో’ పేరిట సినీ సంగీత విభావరి నిర్వహించారు. ఆత్రేయ రచించిన గీతాలను గాయకులు ఆలపించారు. మాజీ ఎంపీ మాట్లాడుతూ ఆయన పాటలతో తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారని వ్యాఖ్యానించారు. పైడా విద్యా సంస్థల అధినేత పైడా కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ ఎంతటి బరువైన భావాన్నైనా అర్థవంతమైన, తేలికైన పదాలతో పలికించడంలో ఆత్రేయ దిట్ట అని పేర్కొన్నారు. ‘ఈటీవీ స్వరాభిషేకం’లో పాల్గొన్న గాయకులు వీరలక్ష్మి, ఆకాంక్ష వల్లీ, పైలట్‌ ఆకొండి కిరణ్మయిలను సత్కరించారు. ఆత్రేయ కళాపీఠం, ఎంవీఆర్‌ ట్రస్ట్‌ ప్రతినిధి గంటి మురళీ తదితరులు పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





