
హైదరాబాద్‌: కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌పై విచారణకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. 30 రోజుల్లో విచారణ జరపాలని శాసనసభ వేదికగా తెలిపారు. 700 ఎకరాల ఫామ్‌హౌస్‌ కేసీఆర్‌కు ఉందా లేదా తేల్చాలన్నారు. ‘‘కేటీఆర్‌ జన్వాడ ఫామ్‌హౌస్‌పై నేనెందుకు బాంబులు వేస్తా? నేనేమైనా బిన్‌ లాడెన్‌నా? స్టీఫెన్‌సన్‌కు ఎన్నికల ముందు నజరానా ఇచ్చారు. రూ.50 కోట్ల భూమిని రూ.1.53 కోట్లకే రెగ్యులరైజ్‌ చేశారు’’ అని అన్నారు. త్వరలో ఎల్బీ నగర్‌ నియోజకవర్గంలో స్థలాలను రెగ్యులరైజ్‌ చేస్తామని రేవంత్‌ తెలిపారు.





