
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కేసీఆర్ కుటుంబ భూముల అంశం హాట్‌టాపిక్‌గా మారింది. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు చెందిన ఎర్రవల్లి ఫామ్‌హౌస్ భూములపై విచారణ జరిపాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఫామ్‌హౌస్ పరిధిలోని భూముల వివరాలు, వాటి యాజమాన్య హక్కులు, ప్రభుత్వ భూములు ఏమైనా ఉన్నాయా అనే అంశాలపై సమగ్రంగా పరిశీలించాలని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. విచారణను నిర్ణీత గడువులో పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. విచారణ జరపడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామని రేవంత్ హెచ్చరించారు.





