
కరీంనగర్‌: తెలంగాణలో 60శాతం జనాభాకు భూమి లేదు.. 25లక్షల కుటుంబాలకు ఇంటి స్థలం కూడా లేదని కేంద్రమంత్రి బండి సంజయ్‌ (Bandi Sanjay) అన్నారు. కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ధరణి పేరుతో బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు, కేసీఆర్‌ కుటుంబం అడ్డగోలుగా దోచుకున్నారని పాదయాత్ర సందర్భంగానే హెచ్చరించా. ఫామ్‌హౌస్‌ అక్రమాల గురించి మాట్లాడితే నా తల ఆరు ముక్కలుగా నరుకుతానని కేసీఆర్‌ అన్నారు. కేసీఆర్‌ నాకు వార్నింగ్‌ ఇచ్చారని బీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు.. కేసీఆర్‌ను మెడపట్టి ఫామ్‌హౌస్‌ నుంచి బయటకు గుంజుకొచ్చిందే భాజపా. నన్ను బెదిరించే వారు ఈ భూమ్మీద పుట్టలేదు. తెలంగాణలో అధికారం మాకు రావాల్సింది.. త్రుటిలో తప్పి అటు పోయింది. ఎవరు.. ఎవరి మెడలు వంచారో తెలంగాణ ప్రజలకు తెలుసు. రాష్ట్రంలో వేల ఎకరాల భూమి కబ్జాకు గురైందని చెప్పడానికి ముఖ్యమంత్రికి వెయ్యి రోజులు పట్టిందా? ఇన్ని రోజలు డీల్‌ కుదరలేదా? బీఆర్‌ఎస్‌ నేతలతో సెటిల్మెంట్‌ కుదరనందుకు ఇప్పుడు బయటపెడుతున్నారా?’’ అని బండి సంజయ్‌ ప్రశ్నించారు. కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌పై విచారణకు ఆదేశం: సీఎం రేవంత్‌ .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





