
ఖమ్మం కార్పొరేషన్: ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్సీ తాతా మధు లబ్ధిదారులకు అందజేశారు. బీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 72 మందికి రూ.15.48లక్షల విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. కేసీఆర్‌ నాయకత్వంలో రూ.2 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు వైద్య చికిత్సలకు లెటర్ ఆఫ్ క్రెడిట్ అందించేవారని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం సంక్షేమ పథకాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





