
ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్‌ (KCR) ఫామ్‌ హౌస్‌పై విచారణకు తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) ఆదేశించారు. 30 రోజుల్లో విచారణ జరపాలని శాసనసభ వేదికగా తెలిపారు. కేసీఆర్‌కు 700 ఎకరాల ఫామ్‌ హౌస్‌ ఉందో?లేదో తేల్చాలన్నారు. అందులో 388 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని కేసీఆర్‌ ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ఆ ప్రభుత్వ భూమిని పేదలకు పంచిపెడతామని ప్రకటించారు. 22ఏ నిషేధిత భూముల అంశంపై అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ ఈ విషయాలు చెప్పారు. ఈ వార్త చదివారా: ప్రైవేటు, భూదాన్‌ భూముల వివరాలు బయటకు తీయాలి: కూనంనేని





