
మైనర్లు డ్రైవింగ్‌ చేస్తూ పట్టుబడిన కేసులు ఇటీవల ఎక్కువయ్యాయి. అలా జరిగితే.. మొదట వాహనాన్ని సీజ్‌ చేసి, మైనర్‌తోపాటు వాహన యజమానిపై కేసు నమోదు చేస్తారు. రవాణా అధికారులు బండి ఆర్సీని రద్దు చేస్తారు. వాహన యజమాని రెగ్యులర్‌ కోర్టుకు హాజరై మేజిస్ట్రేట్‌ తీర్పు మేరకు నడుచుకోవాలి. మైనర్‌ జువనైల్‌ కోర్టుకు హాజరుకావాలి. 18 ఏళ్లకే రావాల్సిన డ్రైవింగ్‌ లైసెన్సును ఈ కేసులో చిక్కిన బాలలకు 25 ఏళ్లు వచ్చే వరకు ఇవ్వరు. ⇒ మరిన్ని వివరాలు





