
ఆటోమొబైల్‌ కంపెనీల సబ్‌స్క్రిప్షన్‌ విధానం కారు కొనకుండానే సొంతమయ్యే మార్గం ఉండగా ఇక దిగులే అవసరం లేదు. కొత్త కార్లను పలు ఆటోమొబైల్‌ కంపెనీలు ఏడాది నుంచి ఐదేళ్ల కాలానికి సబ్‌స్క్రిప్షన్‌ విధానంలో ఇస్తున్నాయి. కొత్త కారును సొంతం చేసుకునేందుకు చౌకైన మార్గం అంటున్నాయి. ఆ కారు మీ దగ్గర ఉన్నంత వరకు మీరే యాజమాని. నచ్చిన కారు తీసుకుని నచ్చినన్ని రోజులు నడుపుకోవచ్చు. ఏటా బీమా చెల్లింపు, మెయింటెనెన్స్‌ వంటి బాదరబందీ ఉండదని చెబుతున్నారు. కొ త్త కారు కొనాలంటే చాలామందికి ఇప్పటికీ ఆర్థికంగా భారమే. అయినా రుణాలు తీసుకుని నెలవారీ ఈఎంఐలు చెల్లిస్తున్నారు. మూడు, నాలుగేళ్లు కాగానే.. ఈఎంఐ తీరకముందే ఆ కారుపై ఆసక్తి తగ్గుతుంది. మార్కెట్లోకి వచ్చిన కొత్త కారుపై మనసు పడుతుంది. పాతది అమ్ముదామంటే ఆశించిన ధర రాదు.. మళ్లీ కొత్తకారుకు అధిక ధర, లైఫ్‌టాక్స్‌ చెల్లించాలి. ప్రతి నాలుగైదేళ్లకు కారును మార్చే అలవాటు ఉన్నవారికి పూర్తి ధర చెల్లించాల్సిన పనిలేకుండానే పరిమిత కాలానికి కారు సొంతం చేసుకునేందుకు మార్కెట్లో అందుబాటులో ఉన్నదే సబ్‌స్క్రిష్షన్‌ విధానం. కారు సబ్‌స్క్రిష్షన్‌ అంటే నిర్దిష్ట కాలానికి వాహనాన్ని అద్దెకు తీసుకోవడం. షోరూం బండినే లీజుకు ఇస్తారు. ఏడాది నుంచి ఐదేళ్ల వరకు తీసుకోవచ్చు. కంపెనీ, కారు మోడల్‌నుబట్టి లీజింగ్‌ వ్యవధులు మారుతుంటాయి. నెలవారీ ఈఎంఐ చెల్లించే బదులు.. ప్రతినెలా కారుకు సబ్‌స్క్రిప్షన్‌ రుసుము చెల్లించాలి. ఈ పద్ధతిలో కారు యాజమాన్య హక్కులు లీజింగ్‌ కంపెనీ వద్దే ఉంటాయి. ఒప్పందం ముగిశాక కారును తిరిగి ఇచ్చేయొచ్చు. లేదంటే మిగిలిన విలువ చెల్లించి కొనుగోలు చేయొచ్చు. లేదా కొత్త మోడల్‌ తీసుకోవచ్చు. ఎంపిక చేసిన మోడల్స్‌పై.. కార్పొరేట్‌ ఉద్యోగుల నుంచి ఎక్కువ సబ్‌స్క్రిప్షన్‌/లీజింగ్‌ విధానంలో కార్లు తీసుకోవడంపై ఎక్కువగా కార్పొరేట్‌ కంపెనీ ఉద్యోగులు ఆసక్తి చూపిస్తున్నారు. ఆయా సంస్థలో ఉద్యోగి అర్హతనుబట్టి వీటిని ఆఫర్‌ చేస్తున్నారు. మెయింటెనెన్స్, బీమా లీజింగ్‌ కంపెనీ చూసుకుంటుంది. 7-8 ఏళ్ల వ్యవధి, నాలుగేళ్ల లాక్‌ఇన్‌ పీరియడ్‌ ఉంటుంది. విదేశాల్లో ఈ విధానం బాగా ప్రాచుర్యం పొందింది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.



