
KTR | ప్రజల ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. 30 శాతం కమీషన్ల కోసం చిల్లర ప్రయత్నాలు మానుకోవాలి. బేషరతుగా క్షమాపణ చెప్పి కాలనీలు, అపార్ట్మెంట్లు, ఇళ్లను జాబితా నుంచి తొలగించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఢిల్లీలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లిన కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ధరణి రక్షణ కవచం.. ఇప్పుడు ‘భూభారతి కాదు.. భూ హారతి’ అసైన్డ్ భూములపై ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ, ఎస్టీలకు యాజమాన్య హక్కులు కల్పించాలన్నారు. ప్రభుత్వం చేసిన తప్పులకు ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారు. రెండేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది.. అన్ని అక్రమాలు వెలుగులోకి తెస్తాం. 22ఏ కింద లక్షల ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ప్రజల ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టి దోపిడీకి పాల్పడుతున్నారని, 30 శాతం కమిషన్ల కోసం చేస్తున్న చిల్లర ప్రయత్నాలను ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. 22ఏ అంశంపై అసెంబ్లీలో ప్రభుత్వం సరైన సమాధానం ఇస్తుందని ఆశించామని, అయితే రెవెన్యూ మంత్రి కేవలం ‘సారీ’తో సరిపెట్టారని కేటీఆర్ అన్నారు. ‘తప్పు చేసింది అధికారులు కాదు.. ప్రభుత్వమే. ప్రజల సమస్యలను పరిష్కరించకుండా అధికారులపై నెపం నెట్టడం సరికాదు’ అని అన్నారు. ప్రజలు తమ కష్టార్జితంతో కొనుగోలు చేసిన కాలనీలు, అపార్ట్మెంట్లు, ఇళ్లను నిషేధిత జాబితాలో చేర్చినట్లయితే వాటిని బేషరతుగా తొలగించి, బాధితులకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ధరణి వ్యవస్థ ప్రజల ఆస్తులకు రక్షణ కవచంలా ఉండేదని కేటీఆర్ పేర్కొన్నారు. యజమాని వేలిముద్ర లేకుండా ఆస్తి బదిలీ చేయడం సాధ్యం కాని విధంగా భద్రత ఉండేదన్నారు. ప్రస్తుతం యజమానులకు తెలియకుండానే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని, ఆస్తులు నిషేధిత జాబితాలోకి వెళ్తున్నాయని ఆరోపించారు. ‘ఇది భూభారతి కాదు.. భూ హారతి’ అని వ్యాఖ్యానించారు. అన్ని అడ్డగోలు చర్యలను నిలిపివేసి, ప్రజల యాజమాన్య హక్కులను రక్షణ కల్పించేలా యథాతథ పరిస్థితిని పునరుద్ధరించాలని కోరారు. అసైన్డ్ భూములపై హామీ నిలబెట్టుకోవాలి.. అసైన్డ్ భూముల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ఇచ్చిన హామీని ఇప్పుడు అమలు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీలకు చెందిన అసైన్డ్ భూములను రెగ్యులరైజ్ చేసి, వారికి యాజమాన్య హక్కులు కల్పించాలని అన్నారు. అసైన్డ్ భూములకు పట్టాలిచ్చే పేరుతో ముందుగానే ఒప్పందాలు జరుగుతున్నాయన్న అనుమానాలు ఉన్నాయని కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వం తీసుకునే ప్రతి పథకం వెనుక అక్రమాలు ఉన్నాయన్న తమ ఆరోపణలు భవిష్యత్తులో వెలుగులోకి వస్తాయని అన్నారు. ‘రెండేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. తప్పు చేసిన వారిని వదిలిపెట్టం’ అని పేర్కొన్నారు. ప్రధాన ప్రతిపక్షాన్ని సభ నుంచి బయటకు పంపారుప్రజాస్వామ్యంలో ప్రధాన ప్రతిపక్షంగా నిరసన తెలిపే హక్కు తమకుందని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ సభ్యులు అనని మాటలను అంటగట్టి, సభ నుంచి బయటకు పంపారని ఆరోపించారు. ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అంశాల నుంచి తప్పించుకునేందుకే తమను సస్పెండ్ చేసిందన్నారు. ‘సస్పెండ్ చేసినప్పటికీ మేము ప్రజల్లోనే ఉన్నాం. ప్రజా సమస్యలను ఎత్తిచూపుతూనే ఉంటాం. 22ఏ అంశమైనా, ప్రజల భూముల సమస్యలైనా ప్రజల మధ్యకు తీసుకెళ్తాం’ అని కేటీఆర్ అన్నారు. 22ఏ పై న్యాయ విచారణకు స్వాగతం.. 22ఏ వ్యవహారంపై జ్యుడీషియల్ ఎంక్వైరీ జరిగితే అందరికీ మంచిదేనని కేటీఆర్ అన్నారు. ‘తప్పు చేసింది ప్రభుత్వం.. శిక్ష అనుభవిస్తున్నది ప్రజలు’ అని వ్యాఖ్యానించారు. నిషేధిత జాబితాలో ఆస్తులను చేర్చడం ద్వారా ప్రజల యాజమాన్య హక్కులను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. ఇవాళ తప్పించుకున్నా రేపు తప్పించుకోలేరని హెచ్చరించారు. పోలీసులపై నమ్మకం లేదు.. న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ ఇంటిపై దాడి ఘటనను ప్రస్తావిస్తూ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. తమ సిబ్బందిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి అక్కడే కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల కంటే హీనంగా పనిచేస్తున్నారని విమర్శించారు.‘పోలీసులను నమ్ముకుంటే న్యాయం దొరకదనే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నాం. న్యాయస్థానంలో తప్పకుండా న్యాయం దొరుకుతుందని ఆశిస్తున్నాం’ అని కేటీఆర్ అన్నారు. కామన్ సివిల్ కోడ్‌పై ఇప్పుడే నిర్ణయం చెప్పాల్సిన అవసరం లేదని, అలాంటి ప్రతిపాదన వచ్చినప్పుడు పార్టీ నాయకత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కేటీఆర్ తెలిపారు. ప్రజల సొమ్ము దోచుకోవడానికే 22A పేరిట, లక్షల ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టి, 30% కమీషన్ కోసం చేసే చిల్లర ప్రయత్నాలను మానుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వేల కాలనీలు, ఇండ్లను నిషేధిత జాబితాలో పెట్టి, ప్రజలను ఇబ్బంది పెట్టినందుకు రేవంత్ ప్రభుత్వం ప్రజలకు… pic.twitter.com/oFOpFRzuZa — BRS Party (@BRSparty) September 15, 2026





