
నెల్లిమర్ల: వివాహేతర సంబంధం.. ఓ వివాహిత హత్యకు కారణమైంది. ఈ ఘటన విజయనగరం (Vizianagarm) జిల్లా పూసపాటిరేగ మండలం పెద్దనడిపిల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దనడిపల్లి గ్రామానికి చెందిన మహిళతో అదే గ్రామానికి చెందిన లంకలపల్లి బంగారు బాబు మధ్య వివాహేతర సంబంధం ఉంది. ఇటీవల వారిమధ్య విభేధాలు వచ్చాయి. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ఆమె.. బంగారుబాబుకు ఫోన్ చేసి ఆయన ఇంటికి వెళ్లింది. అదే సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా.. నిందితుడు ఆమె ఛాతిపై కుర్చొని నోరు ముక్కు గట్టిగా నొక్కడంతో ఊపిరాడక ఆమె మృతిచెందింది. అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో మూటకట్టి సారిపల్లి సమీపంలో పడేసి ఇంటికెళ్లాడు. విహారయాత్రలో విషాదం.. సోకిలేరు వాగులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ గల్లంతు తన భార్య కనిపించడం లేదని ఆమె భర్త పూసపాటిరేగ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ద్విచక్రవాహనంపై మృతదేహాన్ని తరలిస్తున్న సీసీటీవీ ఫుటేజీ పోలీసులకు లభించింది. నిందితుడు బంగారుబాబు పెద్దనడిపిల్లి గ్రామ సమీపంలోని కొబ్బరితోటలో ఉన్నట్టు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వివాహేతర సంబంధం కారణంగా ఏర్పడిన విభేదాల నేపథ్యంలోనే బంగారుబాబు ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధరణకు వచ్చారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





