
గగనతలంలో అనుమానాస్పద కదలికల నేపథ్యంలో.. ప్రత్యర్థుల డ్రోన్లు దూసుకొస్తున్నాయని భావించి లిథువేనియాలో యుద్ధవిమానాలు హడావుడిగా గాల్లోకి ఎగిరాయి. తీరా అవి డ్రోన్లు కావని.. పక్షుల గుంపు అని తెలుసుకొని పైలట్లు అవాక్కయ్యారు. అవి పక్షులని తేలడానికి ముందు లిథువేనియా విల్నియస్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా మూసివేసింది. విషయం తెలిశాక ఆ అలర్ట్‌ను ఎత్తివేసింది. రాడార్ రీడింగ్స్‌లో పక్షులు, డ్రోన్ల సిగ్నేచర్‌ ఒక్కోసారి ఒకేరకంగా ఉండే అవకాశాలు ఉంటాయని కమాండ్ సెంటర్ వివరణ ఇచ్చింది.





