
ప్రస్తుతం కేవలం పట్టణ స్థానిక సంస్థల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ‘బిల్డ్‌నౌ’ విధానం ఇకపై పంచాయతీలలో కూడా అమలుచేయనున్నారు. దాంతో ఇళ్లు, వాణిజ్య సముదాయాలు, లేఅవుట్ల వంటివాటి అనుమతి ప్రక్రియ నిమిషాల్లోనే పూర్తి కానుంది. ఈ మేరకు అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేయగా ప్రభుత్వం ఆమోదం పొందిన వెంటనే పంచాయతీలలోనూ ఈ విధానం అమలులోకి రానుంది. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లోనూ అనుమతుల ప్రక్రియ వేగం పుంజుకోనుంది. వివరాల్లోకి..





