
ఏపీ ప్రభుత్వం చిరు వ్యాపారులకు తీపికబురు అందించింది. చిరు వ్యాపారులు చేసుకునేవారికి రుణాలు అందించనుంది. ఈ మేరకు లోక కళ్యాణ పేరుతో మేళా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా స్వనిథి పథకం ద్వారా చిరు వ్యాపారులు రూ.30 వేల వరకు రుణం పొందవచ్చు. ఈ మేళాలో భాగంగా పండ్లు, కూరగాయలు, తోపుడు బళ్ల వ్యాపారం చేసుకునేవారికి బ్యాంక్ నుంచి క్రెడిట్ కార్డులు అందిస్తారు. కనిష్టంగా రూ.10 వేలు, గరిష్టంగా రూ.30 వరకు పొందవచ్చు. ఈ నిధులను తమ వ్యాపారం కోసం ఉపయోగించుకోవచ్చు. రాష్ట్రంలోని ప్రధాన నగరాలతో పాటు పట్టణాలతో కలిసి దాదాపు 6.40 లక్షల మంది చిరు వ్యాపారులకు దీని వల్ల ప్రయోజనం చేకూరనుంది.



