
డుండ్రిగూడ: అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడలో ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ ఆత్మహత్యకు యత్నించారు. స్థానిక పీఎస్‌లో విధులు నిర్వర్తిస్తున్న బి.సత్యనారాయణ తుపాకీతో కాల్చుకున్నారు. తీవ్రగాయాలు కావడంతో ఆయన్ను అరకులోయ ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




