
గుమ్మలక్ష్మీపురం: భద్రగిరి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న బిడ్డిక రామమ్మ మృతి చెందడం బాధాకరమని మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజు అన్నారు. గుమ్మలక్ష్మీపురం మండలం పుట్టగూడలో రామమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆమె మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రామమ్మ చిత్రపటానికి నివాళులర్పించి, బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. విద్యాభివృద్ధికి కృషి చేస్తూ ఎంతో మంది గిరిజన విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దారని గుర్తు చేసుకున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





