
AI Video: సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను టార్గెట్ చేస్తూ ఏఐ ద్వారా అభ్యంతరకర రీతిలో వీడియోను క్రియేట్ చేశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన కేసులో సమాజ్‌వాదీ పార్టీ మాజీ ఎమ్మెల్యే జగ్రామ్ పాశ్వాన్ సోదరుడిని అరెస్టు చేశారు.
© 2026 nimisham.in

AI Video: సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను టార్గెట్ చేస్తూ ఏఐ ద్వారా అభ్యంతరకర రీతిలో వీడియోను క్రియేట్ చేశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన కేసులో సమాజ్‌వాదీ పార్టీ మాజీ ఎమ్మెల్యే జగ్రామ్ పాశ్వాన్ సోదరుడిని అరెస్టు చేశారు.
బల్రాంపూర్: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను టార్గెట్ చేస్తూ ఏఐ ద్వారా అభ్యంతరకర రీతిలో వీడియో(AI Video)ను క్రియేట్ చేశారు. అయితే ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన కేసులో సమాజ్‌వాదీ పార్టీ మాజీ ఎమ్మెల్యే జగ్రామ్ పాశ్వాన్ సోదరుడిని అరెస్టు చేశారు. మాజీ ఎమ్మెల్యే సోదరుడు సంధూ పాశ్వాన్‌ను అదుపులోకి తీసుకున్నట్లు అదనపు ఎస్పీ విశాల్ పాండే పేర్కొన్నారు. సంధూ పాశ్వాన్ అకౌంట్ నుంచి ఆ వీడియోను పోస్టు చేసినట్లు గుర్తించారు. వీడియో ఘటనను సమోటోగా తీసుకుని, దేహత్ కోత్వాల్ పోలీసు స్టేషన్ కేసు బుక్ చేసినట్లు ఆయన చెప్ఆపరు. పాశ్వాన్‌ను అరెస్టు చేశామని, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అదనపు ఎస్పీ పేర్కొన్నారు. అలాంటి కాంటెంట్ వల్ల సమాజంలో సామరస్యత దెబ్బతింటుందని, కుల విద్వేషాలకు దారి తీసే అభ్యంతరకర వీడియోలు అప్లోడ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ పాండే హెచ్చరించారు. ఆన్లైన్లో జరుగుతున్న ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలను తమ సోషల్ మీడియా మానిటరింగ్ బృందం నిత్యం పర్యవేక్షిస్తోందన్నారు. అభ్యంతరకర పోస్టులను అప్లోడ్ చేయడం కానీ, షేరింగ్ చేయడం కానీ మానుకోవాలని ఆయన ప్రజల్ని కోరారు.
Senior Editorial Lead • Nimisham
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Nimisham.
స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈ ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోండి.







