
© 2026 nimisham.in

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన ‘తెలంగాణ విమోచన దినోత్సవం’ వేడుకల్లో భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ... కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలపై విరుచుకుపడ్డారు. తెలంగాణలో రజాకార్లు జరిపిన నరమేధం, ఘోరాలను గత పాలకులు చరిత్ర పుటల నుంచి తొక్కిపెట్టారని మండిపడ్డారు. చరిత్రను ఎంత దాచాలని చూసినా సత్యం దాగిపోదని స్పష్టం చేశారు. ఎంఐఎంకు భయపడే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడానికి వెనుకాడాయని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం ఎంఐఎంకు అనుకూలంగా ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
Senior Editorial Lead • Nimisham
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Nimisham.
Help others stay updated with verified breaking news and insights.








