
నస్రుల్లాబాద్‌: నస్రుల్లాబాద్‌లోని ఆర్సెటీ భవనంలో కెనరా బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా మగ్గం వర్క్‌పై శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆర్సెటీ డైరెక్టర్ అమర్ సింగ్ తెలిపారు. ఈ నెల 17 నుంచి అక్టోబర్ 11 వరకు మహిళలకు ఉచిత భోజనంతో పాటు వసతి కల్పించనున్నట్లు తెలిపారు. 19 నుంచి 50 ఏళ్ల లోపు వయసు గల వారు అర్హులన్నారు. శిక్షణ కోసం వచ్చే మహిళలు పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించాలన్నారు. అభ్యర్థులు రేషన్ కార్డులతో ఈ నెల 17 లోపు శిక్షణ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





