

- ఈపీఎఫ్ఓ కొత్త అడ్వాన్స్ రూల్స్ ఏంటి?
- అనారోగ్యం, చదువు, పెళ్లి, ఇల్లు కోసం అడ్వాన్స్
- పీఎఫ్ విత్‌డ్రా నిబంధనలు సింపుల్.. ఎన్నిసార్లు తీసుకోవచ్చు?
New EPF Advance Rules : పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ న్యూస్.. ఇకపై పీఎఫ్ డబ్బుల విషయంలో ఆందోళన అక్కర్లేదు.. మీ పీఎఫ్ డబ్బులను ఎలా ఎన్నిసార్లు తీసుకోవచ్చో తెలుసా? ఈపీఎఫ్ కొత్త అడ్వాన్స్ రూల్స్ మారాయి. పీఎఫ్ అడ్వాన్స్ నిబంధనలు మరింత ఈజీగా మారాయి.
ఇక అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే కాదు.. చదువు, పెళ్లి, ఇల్లు కొనడం, ఇంటి నిర్మాణం, హోమ్ లోన్ చెల్లింపు, ఇంటి రిపేర్ వంటి అవసరాలకు కూడా ఈపీఎఫ్ అడ్వాన్స్ డబ్బులు వాడుకోవచ్చు. కొత్త విధానంలో ఈపీఎఫ్ అడ్వాన్స్ రూల్స్‌ను ప్రధానంగా మూడు కేటగిరీలుగా విభజించారు. ఇంతకీ అవేంటో ఓసారి లుక్కేయండి..
ఫస్ట్ కేటగిరీ అనేది ఎమర్జెన్సీ అవసరాలకు పీఎఫ్ డబ్బులు పనికివస్తాయి. ఉద్యోగి లేదా కుటుంబ సభ్యులకు అనారోగ్యంగా ఉంటే ఈపీఎఫ్ అడ్వాన్స్ పొందవచ్చు. ఈ కేటగిరీలో అనారోగ్యం కోసం అడ్వాన్స్ తీసుకునే సంఖ్యపై ప్రత్యేక పరిమితి లేదు.
- అనారోగ్యం, చదువు, పెళ్లి, ఇల్లు కోసం అడ్వాన్స్





