
Narendra Modi 76 birthday special: ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ పుట్టినరోజు.. ఆయన ఈసారి ప్రజా సేవలో 25 ఏళ్ల మైలు రాయిని అందుకున్నారు. మోదీ జన్మదినాన్ని ‘సేవా దివస్’గా జరుపుతున్నారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఛాయ్వాలాగా జీవితాన్ని ప్రారంభించి.. దేశ ప్రధానిగా వరుసగా మూడుసార్లు బాధ్యతలు చేపట్టి ఎన్నో రికార్డుల్ని సొంతం చేసుకున్నారు. నరేంద్ర మోదీ రాజకీయ ప్రస్థానంలోని మైలు రాళ్లను ఒకసారి గుర్తు చేసుకుందాం..





