
అచ్చంపేట: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికి వెళ్లి వివరించాలని భాజపా జిల్లా కార్యదర్శి వి.ఆంజనేయులు అన్నారు. పట్టణంలో నిర్వహించిన సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజాసేవ, ఆరోగ్యం, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించనునున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా కార్యకర్తలు శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాజపా మండల అధ్యక్షురాలు జ్యోతి, నాయకులు పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





