
బెంగళూరు, క్రీడలు: ప్రముఖ కన్నడ నటుడు అనంత్‌ నాగ్‌ను 2024 ఏడాదికిగానూ ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు వరించింది. సెప్టెంబర్ 22న గుజరాత్‌లో జరగనున్న 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ఉత్సవంలో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ నేపథ్యంలో అనంత్‌నాగ్‌కు ప్రధాని మోదీ అభినందనలు తెలుపుతూ ఎక్స్‌వేదికగా పోస్ట్‌ చేశారు. 1948లో జన్మించిన అనంత్ నాగ్‌.. తన కెరీర్‌లో 250కి పైగా కన్నడ చిత్రాలతో సహా 300కు పైగా ఇతర చిత్రల్లో నటించారు. హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, మలయాళం, ఆంగ్ల చిత్రాల్లోనూ తన నటనతో ప్రసిద్ధిగాంచారు. కర్ణాటక చలనచిత్ర అవార్డులను ఐదుసార్లు అందుకున్న అనంత్‌ నాగ్ 2025లో పద్మభూషణ్ అవార్డును స్వీకరించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.