
Home » National » PM Modi BRICS global crises preparedness international cooperation BSB
పరస్పరం అనుసంధానమై ఉన్న నేటి ప్రపంచంలో ఏ సంక్షోభమూ ఒకే ప్రాంతానికి పరిమితం కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అంతర్జాతీయ సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని బ్రిక్స్ దేశాలకు ఆయన పిలుపునిచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: పరస్పరం అనుసంధానమై ఉన్న నేటి ప్రపంచంలో ఏ సంక్షోభమూ ఒకే ప్రాంతానికి పరిమితం కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అంతర్జాతీయ సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని బ్రిక్స్ దేశాలకు ఆయన పిలుపునిచ్చారు. ఢిల్లీలోని భారత్ మండపంలో ఆదివారం బ్రిక్స్ సదస్సు చివరి రోజు ‘స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత: సమ్మిళిత ప్రపంచ వృద్ధి కోసం భవిష్యత్తును తీర్చిదిద్దడం’ అనే అంశంపై మోదీ మాట్లాడారు.
ప్రపంచంలో ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయని, దాంతో సాధారణ ప్రజల జీవనంపై ఆ సంక్షోభాలు తీవ్రంగా ప్రభావితం చూపుతున్నాయని మోదీ అన్నారు. మహమ్మారులు, వాతావరణ విపత్తులు, సప్లై చైన్‌లో అడ్డంకులు వంటివి నేటి ప్రపంచంలో ఏ సంక్షోభం కూడా ఒకే ప్రాంతానికి పరిమితం కావని రుజువు చేశాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అలాంటి సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు బ్రిక్స్ కూటమిలో ప్రత్యేకంగా దృష్టి సారించామని తెలిపారు. ‘సవాళ్లను సరైన టైంలో గుర్తించి, ఎదుర్కొని, సరైన చర్యలు తీసుకోవడం అత్యంత అవసరం. ఈ దిశగా బ్రిక్స్ కూటమిలో ఏకాభిప్రాయం కుదిరింది. అంటువ్యాధుల నివారణ, వాటిపై పోరాడే అంశంపై బ్రిక్స్ ఇంటిగ్రేటెడ్ అర్లీ వార్నింగ్ సిస్టమ్‌పై ఏకాభిప్రాయం కుదిరింది. అలాగే విపత్తు నిర్వహణ కోసం అర్లీ వార్నింగ్ డేటా ఇంటిగ్రేషన్ గైడ్ లైన్స్ కూడా రూపొందించాం’ అని మోదీ వివరించారు. కాగా.. నేడు దక్షిణాఫ్రికా, కజకస్తాన్, ఫిలిప్పైన్స్, ఈజిప్ట్, ఉగాండా, నైజీరియా దేశాల అధినేతలతో మోదీ భేటీ కానున్నారు. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరపనున్నారు.
రూ.505కే విమానం తరహా ప్రయాణం.. కేరళలో లగ్జరీ బస్సు వైరల్
ఐర్లాండ్ వ్యక్తి ప్రశ్నకు గ్రోక్ అద్భుత సమాధానం.. ఎలాన్ మస్క్ స్పందనిదే..



