
© 2026 nimisham.in

స్వాధీనం చేసుకున్న గంజాయి మొక్కలను చూపుతున్న ఎస్పీ నితికాపంత్‌ జైనూర్, న్యూస్‌టుడే: 11 గ్రాముల ఎండు గంజాయిని విక్రయించే క్రమంలో నిందితుడు పోలీసులకు చిక్కడంతో.. ఏకంగా పది ఎకరాల్లో సాగు చేస్తున్న గంజాయి వనం గుట్టు రట్టయిన ఘటన కుమురంభీం జిల్లాలో చోటు చేసుకుంది. జైనూరు పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఎస్పీ నితికాపంత్‌ వివరాలు వెల్లడించారు. పట్నాపూర్‌ ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారంతో జైనూర్‌ ఎస్సై రవికుమార్‌ ఆదివారం వాహనాల తనిఖీ చేపట్టారు. అంబురే పుండలిక్‌ అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అతడి వద్ద 11 గ్రాముల గంజాయి పట్టుబడింది. విచారిస్తున్న క్రమంలో తడబడుతూ సమాధానాలు చెప్పాడు. తనకు గంజాయి అలవాటు ఉందని.. మిగిలింది అమ్మేందుకు తీసుకెళ్తున్నానని.. గత ఏడాది కొంత సాగు చేశానని.. ఇలా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో వెంట తీసుకుని పట్నాపూర్‌ శివారులో అటవీ ప్రాంతం గుండా దాదాపు పది కిలోమీటర్ల దూరం కాలినడకన అతడి చేనుకు వెళ్లారు. పది ఎకరాల్లో మొత్తం గంజాయి మొక్కలు.. అంతర పంటగా కంది, పత్తి మొక్కలు ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. ఎండుగంజాయి, స్వాధీనం చేసుకున్న సుమారు 1,500 మొక్కల విలువ రూ.1.50 కోట్ల వరకు ఉంటుందని తెలిపారు. అంబురే పుండలిక్‌తో పాటు అతడి కుమారుడు రమేశ్, అల్లుడు బిస్సే మాధవ్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ వివరించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Senior Editorial Lead • Nimisham
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Nimisham.
స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈ ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోండి.






