
11 గ్రాముల ఎండు గంజాయితో పట్టుబడిన వ్యక్తిని పోలీసులు విచారించగా.. ఏకంగా 10 ఎకరాల్లో గంజాయి సాగు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. పట్నాపూర్ శివారులో అంబురే పుండలిక్ సాగు చేస్తున్న చేలో సుమారు 1500 గంజాయి మొక్కలను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ ఎండు గంజాయితో కలిపి దాదాపు రూ.1.50 కోట్ల వరకు ఉంటుందని ఎస్పీ నితికాపంత్ తెలిపారు..




