
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజున అసెంబ్లీ ముందు జరిగిన ఘటనపై పోలీసుల దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఏ, పీఆర్వోలను ఆదివారం సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో విచారణకు పిలిచారు. లాయర్ల సమక్షంలో ఈ విచారణ జరుగుతుండగా.. మాస్కులు ధరించిన 15 మంది వ్యక్తులు పోలీస్ స్టేషన్లోకి చొరబడ్డారని.. తన పీఏ, పీఆర్వోపై దాడికి పాల్పడ్డారని కేటీఆర్ ఆరోపించారు. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలన్నారు.



