
అచ్చంపేట: చెట్లను నరికివేస్తూ పర్యావరణానికి ముప్పు కలుగజేస్తున్న ప్రజల వైఖరిలో మార్పు తెచ్చేందుకు అచ్చంపేట పట్టణంలో నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో గణనాథుడిని వినూత్నంగా ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు. మట్టితో తయారు చేసిన వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి అటవీ ప్రాంతంలోని చెట్ల మధ్యలో వినాయకుడు ఉన్నట్లుగా ఏర్పాట్లు చేశారు. చెట్లను నరికి వేయకుండా వినాయకుడు కాపలా ఉన్నట్లు రూపొందించారు. వృక్షాల నరికి వేతను అరికట్టి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలన్న సందేశంతో ఏర్పాటు చేసిన మండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





