
అరేబియా సముద్రంలో పాకిస్థాన్, భారత నేవీలకు చెందిన నౌకలు ఢీకొట్టిన ఘటన కలకలం రేపుతోంది. దీనిపై న్యూఢిల్లీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాకిస్థాన్ దౌత్యవేత్త సాద్ అహ్మద్ వారిచ్కు భారత విదేశాంగ శాఖ సమన్లు సైతం జారీ చేసింది. అంతర్జాతీయ జలాల్లో పాక్ నేవీ తీరు బాధ్యతారాహిత్యమని భారత్ మండిపడింది. అయితే, హిందూ మహా సముద్రంలో చైనా అనుసరించే గ్రే జోన్ వ్యూహాలను పాకిస్థాన్ ఇక్కడ అమలు చేయడం ఆందోళనకు గురిచేస్తోంది.





