ఐబొమ్మ రవి నాంపల్లి కోర్టును ఆశ్రయించాడు. తన బ్యాంకు అకౌంట్లను ఫ్రీజ్ చేయడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని వాపోయాడు. కుటుంబాన్ని పోషించుకోవడం, నిత్యావసరాలు, వైద్య ఖర్చులు భరించడం చాలా కష్టంగా మారిందని తన పిటిషన్లో పేర్కొన్నాడు. తన అకౌంట్లలో సుమారు రూ.3 కోట్లు ఉన్నాయని.. వాటిలో కొన్ని అకౌంట్లనైనా అన్‌ఫ్రీజ్ చేయాలని కోర్టును కోరాడు. ఐబొమ్మ పైరసీ వెబ్సైట్ల నిర్వహణ, వేలాది సినిమాల డిజిటల్ కాపీలు, ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లకు ట్రాఫిక్ మళ్లింపు వంటి అంశాలపై పోలీసులు గతంలో దర్యాప్తు చేశారు.





