
జనగామ (Janagama News) జిల్లా రఘునాథపల్లి మండలంలో భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు ఉప్పొంగుతున్నాయి. కుసుంబాయి తండా- జాలు తండా మధ్య ఉన్న వాగు పెద్ద ఎత్తున ప్రవహిస్తుండడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఖిలా షాపురం నుంచి ఆంధ్ర తండాకు వెళ్లే ప్రధాన రహదారిలో కల్వర్టు తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అక్కడి రైతుల పంట పొలాలు నీట మునిగాయి. వివిధ గ్రామాల చెరువులు అలుగు పోస్తున్నాయి. హైదరాబాద్‌ - వరంగల్ 163 జాతీయ రహదారి (Hyderabad - Warangal NH 163) రఘునాథపల్లి వద్ద వాగు పెద్ద ఎత్తున ప్రవహిస్తోంది. ఈ వార్త చదివారా: భారీ వర్షసూచన.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌





