
HYD - WGL జాతీయ రహదారి.. ఉప్పొంగిన వాగు
జనగామ(Janagama) జిల్లా రఘునాథపల్లి మండలంలో భారీ వర్షం కురిసింది.

జనగామ(Janagama) జిల్లా రఘునాథపల్లి మండలంలో భారీ వర్షం కురిసింది.

దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కొలువు దీరిన వైవిధ్యమైన పది గణనాథుని ప్రతిమల్ని ఈ వీడియోల్లో చూడొచ్చు.

లస్ట్ స్టోరీస్ 3 ప్రమోషన్స్‌లో భాగంగా నటి అదితి రావు హైదరి (Aditi Rao Hydari) సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

హైదరాబాద్ పాతబస్తీలోని షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పటేల్ మార్కెట్లో వస్తువుల డిస్ప్లే విషయంలో రెండు వర్గాల మధ్య చిన్నగా మొదలైన వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. దీంతో ఇరువర్గాలు కత్తులు, ఇనుప రాడ్లు, కర్రలతో దాడి చేసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు చార్మినార్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్‌లో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మణికొండలో ఉన్న బీఆర్సీ బిల్డింగ్ సమీపంలోని ఓ షాప్‌లో గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో భయపడిపోయిన జనాలు అక్కడి నుంచి పరుగులు తీశారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది. మంటలను అదుపుచేశారు.

vinayakachavithi festivities in Hyderabad... When is the first puja for the Khairathabad Bada Ganesh?హైదరాబాద్‌లో వినాయక చవితి సందడ.. ఖైరతాబాద్ మహా గణపతి తొలి పూజ ఎప్పుడంటే..?

Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి పాస్ త్వరలోనే!

నేపాల్‌ను భారీ వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ఆగస్టు 26న సంభవించిన ఆకస్మిక వరదల ధాటికి ఆ దేశంలోని జల విద్యుత్ రంగం తీవ్రంగా దెబ్బతింది. చైనా సరిహద్దుకు సుమారు 84 కిలోమీటర్ల దూరంలో ఉన్న గల్చీ ప్రాంతంలోని 'జెహ్రే' పవర్ సబ్‌స్టేషన్ పూర్తిగా నీట మునిగి బురదలో కూరుకుపోయింది.త్రిశూలి నదికి ఆనుకొని ఉన్న ఈ విద్యుత్ కేంద్రం మొత్తం బురదమయమైంది. ట్రాన్స్ఫార్మర్లు, ఇతర యంత్ర పరికరాలు ధ్వంసమై బురదలో కూరుకుపోయాయి. ప్రస్తుతం నేపాల్ సైనిక దళాల సహాయక చర్యల్లో నిమగ్నమై, బురదలో కూరుకుపోయిన యంత్రాలను వెలికితీసేందుకు శ్రమిస్తున్నాయి.నదీ తీరం వెంబడి ధ్వంసమైన ట్రాన్స్ఫార్మర్లు, తెగిపడిన విద్యుత్ తీగలు వరద ఉద్ధృతికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి. వరద సంభవించిన సమయంలో విధుల్లో ఉన్న రమేశ్ అనే ఎలక్ట్రీషియన్ ఆ భయానక పరిస్థితులను వివరించారు. "ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తోందన్న హెచ్చరికలతో ప్రాణాలు కాపాడుకోవడానికి కొండపైకి పరుగులు తీశాం. చూస్తుండగానే నీటి మట్టం అకస్మాత్తుగా పెరిగి, సబ్‌స్టేషన్‌ను పూర్తిగా ముంచేసింది" అని ఆయన తెలిపారు. స్టేషన్ గోడలపై పైకప్పు వరకు కనిపిస్తున్న నీటి మరకలు వరద బీభత్సాన్ని చాటిచెబుతున్నాయి.ఈ విపత్తు కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా వివిధ జల విద్యుత్ ప్రాజెక్టుల వద్ద విధులు నిర్వహిస్తున్న సుమారు 900 మంది కార్మికులు, ఉద్యోగుల ఆచూకీ ఆగస్టు 26 నుంచి లభించడం లేదు. వీరిలో అధిక శాతం మంది సొరంగాల్లో చిక్కుకుపోయి ఉంటారని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న సహాయక చర్యల్లో నేపాల్

చెట్ల కొమ్మల తొలగింపు, నిర్వహణ పనుల కారణంగా గ్రీన్‌పార్క్ ఫీడర్ పరిధిలోని కొన్ని ఏరియాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్: చెట్ల కొమ్మల తొలగింపు, నిర్వహణ పనుల కారణంగా గ్రీన్‌పార్క్ ఫీడర్ పరిధిలోని కాప్రా, శాంతివిహార్ కాలనీ, గ్రీన్‌పార్క్, అశోక్ కాలనీ, రామ్దాస్నగర్ పరిసర ప్రాంతాలలో గురువారం ఉదయం 10 నుంచి 12గంటల వరకు, లక్ష్మీపురం ఫీడర్ పరిధిలోని రుక్మిణీపురి, అయోధ్యనగర్, నయాక్రాంతినగర్, త్యాగరాయనగర్, లక్ష్మీపురం, బృందావన్ కాలనీ పరిసర ప్రాంతాలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, జనప్రియ ఫీడర్ పరిధిలోని జనప్రియ టౌన్‌షి్‌ప పరిసర ప్రాంతాలలో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని సైనిక్‌పురి సెక్షన్ ఏఈ సత్యనారాయణ తెలిపారు. కొనసాగుతున్న ధరల పతనం.. 3 రోజుల్లో రూ.6 వేల పైచిలుకు మేర తగ్గుదల

లేని భూమిని కాగితాల్లో సృష్టించిన రియల్ ముఠా డబ్బుతో అధికారులను ఏమార్చి.. నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసి.. వాటిని బ్యాంకుల్లో తనాఖా పెట్టి ఏకంగా రూ. 4.11 కోట్లు రుణం తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఏడుగురిని అరెస్టు చేసిన పోలీసులు.. బుధవారం సబ్ రిజిస్ట్రార్‌ను సైతం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. లేని భూమితో బ్యాంకు రుణాలు రూ.4.11 కోట్లు కొట్టేసి రియల్ వ్యాపారం హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): లేని భూమిని కాగితాల్లో సృష్టించిన రియల్ ముఠా డబ్బుతో అధికారులను ఏమార్చి.. నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసి.. వాటిని బ్యాంకుల్లో తనాఖా పెట్టి ఏకంగా రూ. 4.11 కోట్లు రుణం తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఏడుగురిని అరెస్టు చేసిన పోలీసులు.. బుధవారం సబ్ రిజిస్ట్రార్‌ను సైతం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఫిర్యాదు అందినా పట్టించుకోకుండా నిందితులకు సహకరించిన పోలీసులపైనా చర్యలు చేపట్టారు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై జవహర్‌నగర్ ఏసీపీ చక్రపాణి, కీసర సీఐ అంజనేయులతో కలిసి మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ వివరాలు వెల్లడించారు... ప్రస్తుతం చంపాపేట ఎస్ఆర్వోగా ఉన్న మహ్మద్ యూసఫ్ రహమాన్ గతంలో కీసరలో సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేశారు. ఆ సమయంలో కొంతమంది రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఆయన్ను సంప్రదించారు. కేవలం కాగితాల్లోనే భూమిని సృష్టించి, వాటిని నిజమైన వ్యక్తులకు సంబంఽధించిన భూమి పత్రాలుగా రిజిస్ట్రేషన్ చేయించారు. అందుకుగాను సబ్ రిజిస్ట్రార్‌కు రూ. 5లక్షలు ముట్టజెప్పారు. తాను మంచివాడినని నిరూపించుకోవడానికి జరిగిన మోసంపై గతేడాది డిసెంబర్లో కీసర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే కేవలం కంప్లైంట్ రావడమే తప్ప.. ఈఎంఐల విషయంలో గానీ, ఆర్థిక లావాదేవీల గురించి గానీ, బ్యాంకు అధికారుల నుంచి కూడా సమస్యలు లేకపోవడంతో.. అప్పట్లో కొంతమంది పోలీసులు ఈ ముఠాకు సహకరించారు. కాగా ఇటీవల కీసర పోలీస్ స్టేషన్లో కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను ఇటీవల బాధ్యతలు

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Onion Rate Hike: కూరగాయలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు నిరంతరం పెరుగుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లోని సామాన్య, మధ్యతరగతి ప్రజలు, ముఖ్యంగా రోజువారీ కూలీలు తమ జీవితాలను కొనసాగించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వంటిట్లో అత్యంత కీలకమైన వస్తువు ఉల్లిపాయ. ప్రతిరోజు వంటల్లో దీని వాడకం తప్పనిసరి. ఇది లేనిదే ఏ కూర కూడా వండటానికి కుదరదు. అలాంటి ఉల్లిపాయల ధరలు గత కొద్ది రోజులుగా గణనీయంగా పెరిగి సామాన్యులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు కిలో రూ.20కే లభించిన ఉల్లిపాయలు ఇప్పుడు ఏకంగా రెట్టింపయ్యాయి. అకాల వర్షాలు మరియు నిల్వ నష్టాల కారణంగా మార్కెట్లకు నాణ్యమైన ఉల్లి సరఫరా తగ్గడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల మార్కెట్లలో ధరలు.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కిలో ఉల్లి ధర రూ. 40 నుండి రూ. 50 వరకు పలుకుతోంది. సెప్టెంబర్ 2వ తేదీ నాటి రైతు బజార్లలోని ధరల వివరాలను గమనిస్తే.. హైదరాబాద్ (మెహిదీపట్నం రైతు బజార్): ఇక్కడ కిలో ఉల్లిపాయల ధర రూ. 40గా ఉంది. ఇతర కూరగాయలతో పోల్చితే టమాట రూ. 19, వంకాయ రూ. 35, బెండకాయ రూ. 35, పచ్చిమిర్చి రూ. 37, బీన్స్ రూ. 65, క్యారెట్ రూ. 37, దొండకాయ రూ. 23, ఆలుగడ్డ రూ. 16 వద్ద కొనసాగుతున్నాయి. విజయవాడ రైతు బజార్: విజయవాడలోని రైతు బజార్లలో చూస్తే కిలో ఉల్లిపాయల ధర రూ. 48

ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. మాదాపూర్, రాయదుర్గం ప్రాంతాల్లో రోడ్లు, ట్రాఫిక్ నిర్వహణ, కనెక్టివిటీపై ఐఏఎల్ఏ (IALA) రెండో అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ట్రాఫిక్ విభాగం జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సున్‌ప్రీత్ సింగ్ పలు కీలక సూచనలు చేశారు. ఐటీ కారిడార్‌లో రద్దీని తగ్గించడంతో పాటు వాహనదారులు, పాదచారుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఐటీ కారిడార్‌లో యుటిలిటీ పనుల కోసం తరచూ రోడ్లను తవ్వుతున్నప్పటికీ.. పనులు పూర్తైన తర్వాత రోడ్లను సక్రమంగా, నాణ్యతతో పునరుద్ధరించడం లేదని ట్రాఫిక్ అధికారులు గుర్తించారు. దీంతో రోడ్లు unevenగా మారి ప్రమాదాలకు అవకాశం పెరుగుతోందని తెలిపారు. యుటిలిటీ పనులు పూర్తైన వెంటనే సంబంధిత సంస్థలు రోడ్లను సకాలంలో నాణ్యతతో పునరుద్ధరించాలని సూచించారు. మరోవైపు ఓలా, ఉబర్ వాహనాల అనియంత్రిత పార్కింగ్ కూడా ట్రాఫిక్ రద్దీకి కారణమవుతోందని అధికారులు తెలిపారు. ఉద్యోగులను పికప్, డ్రాప్ చేసే సమయంలో రోడ్లపై వాహనాలు గుమిగూడకుండా ఐటీ సంస్థలు, ప్రధాన సంస్థలు తమ ప్రాంగణాల్లోనే పికప్, డ్రాప్ ప్రాంతాలతో పాటు ఓలా, ఉబర్ వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ లేదా హోల్డింగ్ ఏరియాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఐటీ కారిడార్‌లో రోడ్ల అభివృద్ధి, కనెక్టివిటీపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. ప్రతిపాదిత రోడ్డు అభివృద్ధి ప్రణాళికను పరిశీలించిన ట్రాఫిక్ అధికారులు.. రహదారుల అనుసంధానం, ట్రాఫిక్ ప్రవాహం, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. ఫ్రీ లెఫ్ట్‌లు, జంక్షన్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించారు. అవసరమైన ప్రాంతాలను గుర్తించి ఫ్రీ లెఫ్ట్ మార్గాలను ఏర్పాటు చేయడంతో పాటు జంక్షన్లలో ఛానలైజేషన్, రోడ్డు జ్యామెట్రీలో మార్పులు చేపట్టాలని సూచించారు. దీంతో జంక్షన్ల వద్ద వాహనాల వేచి ఉండే సమయం తగ్గి ట్రాఫిక్ మరింత సాఫీగా సాగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. అలాగే రోడ్డు
హైదరాబాద్ కంటోన్మెంట్లో ఆర్మీ ఆయుధాలు చోరీ.. తుపాకులు ఎత్తికెళ్లిన దొంగలు హైదరాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ కలకలం రేపింది. ఆయుధాలు భద్రపరిచే రూం తాళం పగులగొట్టి 12 ఆయుధాలతో పాటు మందుగుండు సామగ్రిని గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు అధికారులు గుర్తించారు. ఆర్మీ ఫిర్యాదు మేరకు బొల్లారం పోలీసులు కేసు నమోదు చేశారు. అత్యంత భద్రత ఉండే ప్రాంతంలోకి బయటి వ్యక్తుల ప్రవేశం పరిమితంగా ఉండటంతో లోపలి వ్యక్తుల ప్రమేయంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మల్కాజిగిరి పోలీస్ ఉన్నతాధికారులు సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ వార్తకు సంబంధించిన

మైనారిటీ మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రాష్ట్ర మంత్రి మహ్మద్ అజహరుద్దీన్ స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన మైనారిటీ సంక్షేమ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హైదరాబాద్, సెప్టెంబర్ 02: మైనారిటీ మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రాష్ట్ర మంత్రి మహ్మద్ అజహరుద్దీన్ స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన మైనారిటీ సంక్షేమ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు ఆర్థిక సాయం, ఉపాధి పరికరాలను పంపిణీ చేశారు. మైనారిటీ మహిళల ఆర్థిక సాధికారతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా 278 మంది మైనారిటీ వితంతు మహిళలకు ఒక్కొక్కరికి రూ. 50 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. అలాగే, తుర్క కాశా ముస్లిం కమ్యూనిటీకి చెందిన 13 మందికి రూ. 60 వేల విలువైన జనరేటర్లు, టూల్ కిట్లను పంపిణీ చేశారు. ప్రభుత్వం అందించిన కుట్టు మిషన్లు, జనరేటర్లు, టూల్ కిట్లను సద్వినియోగం చేసుకొని మహిళలు, యువత స్వయం ఉపాధి దిశగా ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు. మైనారిటీల సంక్షేమంపై తమ ప్రభుత్వానికి పూర్తి చిత్తశుద్ధి ఉందని తెలిపారు. ముస్లింల హజ్ ఏర్పాట్ల కోసం సీఎం రేవంత్ రెడ్డి రూ. 7 కోట్లు మంజూరు చేసినట్లు గుర్తుచేశారు. పాతబస్తీ యువత విద్య, నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, కమ్యూనిటీ పెద్దలు యువతకు సరైన మార్గదర్శనం చేయాలని సూచించారు. చేపలు పట్టడం నేర్పించినట్లుగా యువతకు ఉపాధి నైపుణ్యాలు అందించి వారికి తమకు తాముగా, ఇతరులకు అండగా నిలిచేలా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. నిధుల డిమాండ్ల విషయమై స్పందిస్తూ.. తాను టెస్ట్ ప్లేయర్ లాంటివాడినని, పదవిలో ఉన్నంతకాలం ప్రజల సంక్షేమం కోసం పూర్తి అంకితభావంతో పనిచేస్తానని తేల్చిచెప్పారు. టీజీఎంఎఫ్‌సీ (TGMFC) చైర్మన్ ఒబేదుల్లా కోత్వాల్తో కలిసి పాల్గొన్న ఈ కార్యక్రమంలో పలువురు

హైదరాబాద్ ట్రాఫిక్‌కు శాశ్వత పరిష్కారం దిశగా మరో కీలక అడుగు పడిందని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. రూ.620 కోట్లతో నిర్మించిన కీలక కారిడార్ ప్రారంభానికి సిద్ధమైందని పేర్కొన్నారు. హైదరాబాద్, సెప్టెంబర్ 2 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ ట్రాఫిక్‌కు శాశ్వత పరిష్కారం దిశగా మరో కీలక అడుగు పడిందని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ (Telangana Minister Ponnam Prabhakar) వ్యాఖ్యానించారు. రూ.620 కోట్లతో నిర్మించిన కీలక కారిడార్ ప్రారంభానికి సిద్ధమైందని పేర్కొన్నారు. ఈరోజు (బుధవారం) హైదరాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రేపు నల్గొండ ‘ఎక్స్’ రోడ్స్–ఓవైసీ జంక్షన్ కారిడార్ ప్రారంభిస్తు్న్నట్లు వెల్లడించారు. సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా కారిడార్ ప్రారంభోత్సవం జరుగుతోందని చెప్పుకొచ్చారు. నల్గొండ ‘ఎక్స్’ రోడ్స్–సైదాబాద్–ఐఎస్ సదన్–ఓవైసీ జంక్షన్ మధ్య ఈ కారిడార్ ఉందని మంత్రి పొన్నం తెలిపారు. 3.23 కిలోమీటర్ల పొడవున కాన్ఫ్లిక్ట్ ఫ్రీ కారిడార్ నిర్మాణం ఉంటుందని వివరించారు. 2.53 కిలోమీటర్ల ప్రధాన వయాడక్ట్.. 200 మీటర్ల అప్ ర్యాంప్ ఉంటుందని చెప్పారు. నల్గొండ ఎక్స్ రోడ్స్ నుంచి ఓవైసీ ఆస్పత్రి వరకు సిగ్నల్ ఫ్రీ ప్రయాణం కొనసాగుతుందని అన్నారు. ప్రయాణ సమయం సుమారు 30 నిమిషాల వరకు ఆదా అవుతుందని వెల్లడించారు. చంచల్‌గూడ, సైదాబాద్, ఐఎస్ సదన్ ప్రాంతాల్లో ట్రాఫిక్ కష్టాలకు పరిష్కారమవుతాయని మంత్రి పొన్నం చెప్పారు. ఆయా వాహనాలు నిలిచిపోయే సమయం తగ్గడంతో ఇంధన వినియోగం తగ్గుతుందని వెల్లడించారు. వాయు కాలుష్యాన్ని తగ్గించడంలోనూ కారిడార్ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. హైదరాబాద్‌ను ఆధునిక ట్రాఫిక్ వ్యవస్థ కలిగిన నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఉద్ఘాటించారు. ఫ్లైఓవర్లు, వంతెనలు, కాన్ఫ్లిక్ట్ ఫ్రీ కారిడార్లకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధిలో మరో మైలురాయిగా నూతన కారిడార్ ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌ను గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. KPHB Land Auction: తెలంగాణ రాష్ట్రంలో భూముల ధరలు సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. మారుమూల ప్రాంతాల్లో కూడా ఇతర రాష్ట్రాల్లో కన్న అత్యధిక ధరలు పలుకుతుండగా ఇక హైదరాబాద్‌లో భూముల ధరలు దేశంలోనే సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్నాయి. తాజాగా నిర్వహించిన భూముల వేలంలో ఒక్క గజం రూ.2.70 లక్షలు పలికింది. కేపీహెచ్‌బీకి సంబంధించిన భూముల వేలంలో భారీ ధరలు పలికాయి. ఆ భూముల ధరలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కేపీహెచ్‌బీ భూములకు మరోసారి వేలం నిర్వహించగా ఈసారి తీవ్ర పోటీ నెలకొనడంతో భారీ ధరలు పలికాయి. మరోసారి రికార్డు ధరలకు హౌసింగ్ బోర్డు భూములు అమ్ముడుపోయాయి. ఈ వేలం ద్వారా ప్రభుత్వానికి రూ.47.14 కోట్ల మేర ఆదాయం లభించిందని హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ వీపీ గౌతమ్ ప్రకటించారు. ఎటువంటి వివాదాలు లేని.. అన్ని వసతులతో అభివృద్ధి చెందిన కేపీహెచ్‌బీ ప్రాంతంలో నిర్వహించిన ఓపెన్ ప్లాట్లకు భారీ డిమాండ్ వచ్చింది. హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో జరిగిన బహిరంగం వేలంలో ఓపెన్ ప్లాట్లకు రికార్డు ధరలు వచ్చాయి. కేపీహెచ్‌బీ 7 ఫేజ్‌లోని 16 ఎంఐజీ ప్లాట్లకు బుధవారం నిర్వహించిన బహిరంగ వేలంలో ఒక ప్లాట్‌కు ఒక చదరపు గజం భూమి 2.70 లక్షలకు ధర పలికింది. ఈ వేలానికి సంబంధించి హౌసింగ్ బోర్డు ఆగస్టు 10వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయగా.. ఈ ప్లాట్లకు చదరపు గజం కనీస ధరగా రూ.1.60 లక్షలు నిర్దారించింది. ఈ వేలం పాటలో ఓపెన్ ప్లాట్లను దక్కించుకోడానికి మొత్తం 19 మంది కొనుగోలుదారులు (బిడ్డర్లు) పోటీపడ్డారు. వేలంలో చదరపు గజం సగటు
గ్రేటర్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో భూముల ధరలు మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే కోకాపేట, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో భూముల ధరలు భారీ స్థాయికి చేరిన విషయం తెలిసిందే. తాజాగా కూకట్పల్లి హౌసింగ్ బోర్డు (కేపీహెచ్‌బీ)లో నిర్వహించిన భూముల బహిరంగ వేలం కూడా రియల్ ఎస్టేట్ మార్కెట్లో హాట్‌టాపిక్‌గా మారింది. కేపీహెచ్‌బీ 7వ ఫేజ్‌లోని 16 ఎంఐజీ ఓపెన్ ప్లాట్లకు బుధవారం నిర్వహించిన వేలంలో చదరపు గజం గరిష్ఠంగా రూ.2.70 లక్షలు పలికి.. అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.కేపీహెచ్‌బీ 7వ ఫేజ్‌లోని 16 ఎంఐజీ ఓపెన్ ప్లాట్లకు తెలంగాణ హౌసింగ్ బోర్డు తాజాగా బహిరంగ వేలం నిర్వహించింది. ఈ వేలానికి ముందుగా చదరపు గజానికి కనీస ధరను రూ.1.60 లక్షలుగా నిర్ణయించారు. అయితే ప్లాట్లను దక్కించుకునేందుకు బిడ్డర్లు పోటీ పడటంతో ధరలు గణనీయంగా పెరిగాయి. వేలంలో ఒక ప్లాట్ చదరపు గజం రూ.2.70 లక్షలకు అమ్ముడైంది. మరో ప్లాట్‌కు గజం రూ.2.36 లక్షల ధర పలికింది. మరో 2 ప్లాట్లు చదరపు గజం రూ.2.06 లక్షల చొప్పున విక్రయం అయ్యాయి. దీంతో కేపీహెచ్‌బీ ప్రాంతంలో భూములకు ఉన్న డిమాండ్ మరోసారి స్పష్టమైంది.ఈ బహిరంగ వేలంలో మొత్తం 19 మంది బిడ్డర్లు పాల్గొన్నారు. తమకు నచ్చిన ప్లాట్లను దక్కించుకునేందుకు వారు పోటీపడటంతో పలు ప్లాట్లు హౌసింగ్ బోర్డు నిర్ణయించిన కనీస ధర కంటే అధిక మొత్తానికి అమ్ముడయ్యాయి. వేలం పూర్తి అయ్యే సమయానికి 16 ప్లాట్లకు కలిపి చదరపు గజం సగటు ధర సుమారు రూ.1.79 లక్షలుగా నమోదైంది. ఈ ప్లాట్ల విక్రయం ద్వారా తెలంగాణ హౌసింగ్ బోర్డుకు సుమారు రూ.47.14 కోట్ల ఆదాయం సమకూరింది.హైదరాబాద్‌లో కేపీహెచ్‌బీ ప్రాంతానికి ఇప్పటికే ప్రత్యేకమైన రియల్ ఎస్టేట్ గుర్తింపు ఉంది. నగరంలోని ప్రధాన ఐటీ, వాణిజ్య ప్రాంతాలకు రోడ్డు కనెక్టివిటీ, మెట్రో సహా రవాణా సదుపాయాలు, నివాస ప్రాంతంగా ఉన్న డిమాండ్ వంటి అంశాలు ఈ

హైదరాబాద్ నగర పరిధిలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ డాక్టర్ల దందాపై సైబరాబాద్ పోలీసులు దాడులు చేశారు. అర్హత లేకపోయినా వైద్యుల అవతారమెత్తి క్లినిక్‌లు నడుపుతున్న 10 మంది ఫేక్ డాక్టర్లను అరెస్ట్ చేశారు. హైదరాబాద్, సెప్టెంబర్ 1: నగరంలో అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ డాక్టర్ల దందాపై సైబరాబాద్ పోలీసులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అర్హత లేకపోయినా వైద్యుల అవతారమెత్తి క్లినిక్‌లు నడుపుతున్న 10 మంది ఫేక్ డాక్టర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT), వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఈ మెరుపు దాడుల వివరాలను కుత్బుల్లాపూర్ జోన్ డీసీపీ కోటి రెడ్డి వెల్లడించారు. ఏకకాలంలో దాడులు.. 10 ఫేక్ క్లినిక్‌ల సీజ్ మేడ్చల్ - మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని పలు ప్రాంతాల్లో నకిలీ క్లినిక్‌ల దందా విచ్చలవిడిగా సాగుతోందన్న పక్కా సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. పేట్ బషీరాబాద్, మేడ్చల్, జగద్గిరిగుట్ట, సూరారం, పటాన్ చెరు, ఆర్సీ పురం తదితర పోలీసు స్టేషన్ల పరిధిలో ఏకకాలంలో దాడులు నిర్వహించి, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 10 నకిలీ క్లినిక్‌లను సీజ్ చేశారు. టెన్త్, బీకామ్ చదివి.. సెలైన్లు ఎక్కిస్తూ! టెన్త్, ఇంటర్, బీకామ్ వంటి చదువులు మాత్రమే చదివిన ఈ కేటుగాళ్లు, ఎలాంటి కనీస మెడికల్ నాలెడ్జ్ లేదా గుర్తింపు పొందిన డిగ్రీలు లేకుండానే క్లినిక్‌లు తెరిచి ప్రాక్టీస్ చేస్తున్నారని విచారణలో తేలింది. చిన్నపిల్లలకు వైద్యం: ఎలాంటి అర్హత లేకున్నా క్లినిక్‌లలో ఏకంగా బెడ్లు ఏర్పాటు చేసి, అమాయక రోగులకు, చిన్నపిల్లలకు వైద్యం అందిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సిరంజీలు, సెలైన్ల వాడకం: తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో వచ్చే పేషెంట్లకు ఎడాపెడా సెలైన్లు, ఐవీ ఫ్లూయిడ్స్ (IV Fluids) ఎక్కిస్తూ ప్రాణాలపైకి తెస్తున్నారని పోలీసులు తెలిపారు. సామగ్రి సీజ్: దాడుల సమయంలో ఈ క్లినిక్‌ల నుంచి పెద్ద ఎత్తున బీపీ మిషన్లు, స్టెతస్కోప్‌లు

హైదరాబాద్: నగరంలోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డు (కేపీహెచ్‌బీ)లో ఓపెన్ ప్లాట్లు భారీ ధర పలికాయి. కేపీహెచ్‌బీ 7వ ఫేజ్‌లోని 16 ఎంఐజీ ప్లాట్లకు హౌసింగ్ బోర్డు బుధవారం బహిరంగ వేలం నిర్వహించింది. చదరపు గజానికి కనీస ధర రూ.1.60లక్షలుగా నిర్ధరించగా.. అత్యధికంగా రూ.2.70లక్షలు పలికినట్లు హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ వి.పి.గౌతమ్ తెలిపారు. మరో ప్లాట్‌ను చదరపు గజం రూ.2.36 లక్షలకు.. మరో రెండు ప్లాట్లు రూ.2.06 లక్షలకు వేలం పాటలో అమ్ముడుపోయినట్లు చెప్పారు. పూర్తి పారదర్శకంగా నిర్వహించిన ఈ వేలంలో తమకు నచ్చిన ప్లాట్లను దక్కించుకునేందుకు మొత్తం 19 మంది బిడ్డర్లు పోటీ పడ్డారని.. దీని ద్వారా హౌసింగ్ బోర్డుకు రూ.47.14 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు గౌతమ్ తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాత్రి, తెల్లవారుజాము వేళల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గంగా మైదాన ప్రాంతాల వైపు కదులుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం బెంగాల్, జార్ఖండ్ పరిసర ప్రాంతాలపై దీని ప్రభావం కొనసాగుతోంది. రాబోయే 48 గంటల్లో ఈ వ్యవస్థ జార్ఖండ్ మీదుగా ఉత్తరప్రదేశ్ వైపు పశ్చిమ-వాయువ్య దిశలో కదిలే అవకాశం ఉందని అంచనా. దీనికి తోడు మధ్య బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాలు బలంగా కొనసాగుతుండటంతో తెలంగాణతో పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలంగాణలో ప్రస్తుతం విభిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే సాయంత్రం తర్వాత వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని పలుచోట్ల మేఘాలు కమ్ముకుంటున్నాయి. ముఖ్యంగా రాత్రి నుంచి తెల్లవారుజాము మధ్య ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. పగటిపూట ఏర్పడుతున్న అధిక వేడి కారణంగా వాతావరణంలో అస్థిరత పెరుగుతుండటం కూడా స్థానికంగా వర్షాలకు కారణమవుతోంది. దీంతో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడనుండగా, మరికొన్ని చోట్ల ఒక్కసారిగా భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. దక్షిణ, మధ్య, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురిసేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ముఖ్యంగా నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అదేవిధంగా నారాయణపేట, మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో కూడా వర్ష ప్రభావం కనిపించవచ్చని అంచనా. ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు నమోదవుతుండగా, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ

దిల్లీ: తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయొద్దని కాంగ్రెస్ పెద్దలను కోరినట్లు తెలంగాణ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కలిసి తన వివరణ ఇచ్చినట్లు చెప్పారు. నా వ్యవహారంపై పార్టీలో చర్చించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదన్నారు. దిల్లీలో మీడియాతో కొండా సురేఖ మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ అధిష్ఠానానికి నేను చెప్పుకోవాల్సిందంతా చెప్పాను. పార్టీ పెద్దలు ఆలోచిస్తామని చెప్పారు. నా బిడ్డ స్వతంత్రంగా ఉంది. పెళ్లి చేసుకుని ఆ ఇంటి కోడలిగా మాట్లాడిందని అనుకుంటున్నాను. ఆమె జీవితం ఆమె ఇష్టం. నాతో పాటు నా భర్త రాజకీయ జీవితం మా ఇష్టం. నేను మంత్రిగా మంచి పనితీరు కనబరుస్తున్నాను. అవినీతి ఆరోపణలు లేకుండా పనిచేస్తున్నా. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ఉన్నాను. పదవిలో కొనసాగించాలని అధిష్ఠానాన్ని కోరాను. నా బిడ్డ వ్యాఖ్యలపై నేను స్పందించను. సుస్మిత వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు. రోజూ ఎంతో మంది మాట్లాడతారు.. అందులో సుస్మిత కూడా ఒకరు. నా బిడ్డ కాబట్టి నన్ను బాధ్యురాలిని చేయడం సరికాదు. ఆమె వ్యాఖ్యలను ఖండించడం, సమర్థించడం చేయను. నా వివరణను మీనాక్షి నటరాజన్‌కు చెప్పాను. అధిష్ఠానానికి ఆమె చెప్తానన్నారు. పార్టీలో కొందరితో నాపై ఆరోపణలు చేయించారు. ఎవరు అలా చేయించారో తెలుసు. పేర్లు చెబితే వివాదం అవుతుంది. నాపై ఆరోపణలు చేసిన వారికీ షోకాజ్ నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. పార్టీ ఆ దిశగానూ ఆలోచించాలి. నాకు షోకాజ్ నోటీసు ఇవ్వడమే తప్పు. ఏఐసీసీ సభ్యురాలిగా ఉన్నా.. అందుకే ఇక్కడికి వచ్చి నా బాధ చెప్పుకొన్నా. రాహుల్, ప్రియాంక, కేసీ వేణుగోపాల్‌కు రాతపూర్వకంగా వివరణ ఇచ్చా. పార్టీ తీసుకునే నిర్ణయం బట్టి నా ఆలోచన ఉంటుంది’’ అని కొండా సురేఖ అన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు

కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి పిలుపురావడంతో ఢిల్లీకి వెళ్లిన మంత్రి కొండా సురేఖ.. పలువురు పార్టీ పెద్దలతో భేటీ అవుతున్నారు. హైదరాబాద్, సెప్టెంబర్ 2: కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి పిలుపురావడంతో ఢిల్లీకి వెళ్లిన మంత్రి కొండా సురేఖ.. పలువురు పార్టీ పెద్దలతో భేటీ అవుతున్నారు. ఇందులో భాగంగా ఈరోజు(బుధవారం) ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో మంత్రి సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో సురేఖ మాట్లాడుతూ.. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశానని.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో ఇంకా మాట్లాడలేదని అన్నారు. అధిష్ఠానం ఏం చేస్తుందో వేచిచూస్తున్నట్లు తెలిపారు. రాజీనామా చేయాలని తనను కోరలేదని చెప్పారు. బీసీ అయిన తనకు ఒక న్యాయం.. ఇతర సామాజికవర్గాలకు మరో న్యాయం పాటిస్తారా అని కొండా సురేఖ ప్రశ్నించారు. కేబినెట్లో ఉన్న ఇతర సామాజికవర్గాల నేతలపై పెద్దఎత్తున అనేక ఆరోపణలు ఉన్నాయన్నారు. వాటన్నింటికీ ఏం సమాధానం చెబుతారని.. ఎలాంటి చర్యలు తీసుకుంటారని అడిగారు. అన్ని అంశాలపై ఇప్పటికే ఖర్గే, రాహుల్, ప్రియాంక సహా అధిష్ఠాన పెద్దలందరికీ రాతపూర్వకంగా తెలియజేసినట్లు చెప్పారు. సీఎం రేవంత్‌పై అధిష్ఠానం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పదేళ్లు తానే సీఎం అని రేవంత్ ఎలా చెబుతారని ప్రశ్నించారు. అన్ని విషయాలనూ పరిగణనలోకి తీసుకోవాలని ఖర్గేకు చెప్పినట్లు మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. గొల్లగుప్ప ఘటన..చిన్నారి మృతిపై పోస్ట్‌మార్టం రిపోర్టే కీలకం: ఆస్పత్రి సూపరింటెండెంట్ కేటీఆర్ మహాధర్నా.. ఫ్లెక్సీలతో కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్

దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ 2026లో సౌత్ జోన్ జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. నార్త్ జోన్‌తో జరిగిన రెండో సెమీఫైనల్లో సౌత్‌జోన్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. స్పోర్ట్స్ డెస్క్: హైదరాబాదీ ఆటగాడు తిలక్ వర్మ అద్భుత ప్రదర్శనతో దులీప్ ట్రోఫీ 2026లో సౌత్ జోన్ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్-2 వేదికగా నార్త్ జోన్‌తో జరిగిన రెండో సెమీఫైనల్లో సౌత్ జోన్ 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 182 పరుగుల లక్ష్యాన్ని సౌత్ జోన్ 43.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అందుకుంది. మ్యాచ్ విషయానికి వస్తే.. రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు కోల్పోయి 267 స్కోరుతో బుధవారం ఆటను కొనసాగించిన నార్త్ జోన్.. 297 పరుగులకే ఆలౌటైంది. అనంతరం181 పరుగుల లక్ష్యాన్ని సౌత్ జోన్ 43.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు రికీ భుయ్ (42), నారాయణ్ జగదీశన్ (43) శుభారంభం అందించారు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన కెప్టెన్ తిలక్ వర్మ (51*) రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ సెంచరీతో రాణించాడు. రవిచంద్రన్ స్మరన్ (32*) తిలక్ వర్మకు సపోర్టుగా నిలిచి.. జట్టును విజయ తీరాలకు చేర్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో నార్త్ జోన్ 195 పరుగులకే ఆలౌటైంది. సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మ (116 నాటౌట్; 250 బంతులు) శతకంతో మెరవడంతో తొలి ఇన్నింగ్స్‌లో సౌత్ జోన్ 312 పరుగులు చేసి.. 117 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అదరగొట్టిన తిలక్ వర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. తొలి సెమీ ఫైనల్లో సెంట్రల్ జోన్‌పై 4 వికెట్ల తేడాతో ఈస్ట్ జోన్ గెలిచిన విషయం తెలిసిందే. సెప్టెంబరు 6 నుంచి చెపాక్ స్టేడియంలో దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ మొదలుకానుంది. తుదిపోరులో ఇషాన్ కిషన్ సారథ్యంలోని ఈస్ట్ జోన్‌తో సౌత్ జోన్ తలపడనుంది

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అనంతరం మంత్రి కొండా సురేఖ మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ, సెప్టెంబర్ 2: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అనంతరం మంత్రి కొండా సురేఖ మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పదేళ్లు సీఎం అని రేవంత్ ఎలా అంటారని ప్రశ్నించారు. మల్లికార్జున ఖర్గేను కలిశానని, కేసీ వేణుగోపాల్‌తో ఇంకా మాట్లాడలేదని తెలిపారు. వాళ్లు ఏం చేస్తారో వేచి చూస్తున్నానని కొండా సురేఖ పేర్కొన్నారు

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Meat shops closed in Hyderabad city on September 4: ప్రస్తుతం మనం శ్రావణ మాసంలో ఉన్నాం. ఈనెలలో ప్రతి రోజు ఏదో ఒక పండగను మనం జరుపుకుంటాం. అయితే.. సెప్టెంబర్ 4న మనం జన్మాష్టమిని భక్తి శ్రద్దలతో జరుపుకుంటాం. శ్రీకృష్ణ జన్మాష్టమి హిందువులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.ఈ రోజున చాలా మంది ఉపవాసాలు ఉంటారు. విష్ణుమూర్తి ఎనిమిదో అవతారమైన శ్రీకృష్ణుడి జన్మదినాన్ని గ్రాండ్ గా నిర్వహిస్తారు. పలు చోట్ల దహి హండీ ఉట్టి కొట్టే వేడుకను నిర్వహిస్తారు. తమ పిల్లలకు చిన్నారి శ్రీకృష్ణుడు, రాధలా కాస్ట్యూమ్ లు వేసి పొంగిపోతారు. శ్రీకృష్ణుడు అర్ధరాత్రి సమయంలో జన్మించాడనే విశ్వాసంతో రాత్రి వేళ పూజలు నిర్వహిస్తారు. ఈ రోజు అష్టమి, రోహిణి తిథి ఉండేలా చూసుకుంటారు. ఈసారి సెప్టెంబర్ 4, శుక్రవారం రోజునే జన్మాష్టమి వేడుకలు నిర్వహించాలని పండితులు సూచిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ పరిధిలో కూడా జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 4న చికెన్, మటన్ అమ్మకాలపై ఒక రోజు నిషేధం విధిస్తున్నట్లు జీహెచ్ఎంసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. Read more: Konda Surekha: నన్ను ఎవరు పిలువలేదు.. నేనే వచ్చా... ఉత్కంఠ వేళ కొండంత ట్విస్ట్ ఇచ్చిన మంత్రి సురేఖ..! ఈ మేరకు రిటైల్, చికెన్, మటన్ షాపులు, పశువధ శాలలన్ని మూసి వేసి ఉంచాలని అధికారులు తెల్చి చెప్పారు. ఎవరైన రహస్యంగా మాంసం అమ్మకాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అంతే కాకుండా జన్మాష్టమి రోజున ప్రత్యేకంగా తనిఖీలు చేస్తామని వెల్లడించారు. హైదరాబాద్ వాసులు
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి (ఎన్‌హెచ్-65)పై ప్రయాణించే వాహనదారులతో పాటు నకిరేకల్ పరిసర ప్రాంతాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి సేవలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. రూ.32 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ 100 పడకల ఆస్పత్రిని ఈనెల 5వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ ఆస్పత్రి అందుబాటులోకి వస్తే నకిరేకల్‌తో పాటు చుట్టుపక్కల మండలాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు చేరువ కానున్నాయి.నకిరేకల్‌లో గతంలో పరిమిత వసతులతో ఉన్న ఆస్పత్రి ప్రజల అవసరాలను పూర్తిగా తీర్చలేకపోయేది. రోజుకు 350 నుంచి 500 వరకు ఓపీ నమోదవుతున్న నేపథ్యంలో ఆస్పత్రిని 100 పడకలకు అప్‌గ్రేడ్ చేయాలని 2022లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత నేషనల్ హైవే పక్కనే రూ.32 కోట్లతో కొత్త భవనాన్ని నిర్మించారు. నిర్మాణ పనులు సుమారు 5 నెలల క్రితమే పూర్తి అయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రికి రోజుకు 200 నుంచి 250 వరకు ఓపీ వస్తోంది.పూర్తి స్థాయి వైద్య సేవలు ప్రారంభమైతే రోగుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా నకిరేకల్, కట్టంగూర్, కేతేపల్లి ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులను నల్గొండ, హైదరాబాద్‌కు తరలించాల్సిన పరిస్థితి ఉండేది. దీంతో కీలకమైన గోల్డెన్ అవర్‌లో వైద్యం అందక ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉండేది. ఈ సమస్యకు కొత్త ఆస్పత్రి పరిష్కారం చూపనుంది. అత్యవసర వైద్యం, ట్రామా కేర్, ఐసీయూ, ఆర్థోపెడిక్ సేవలతో పాటు సాధారణ శస్త్రచికిత్సలు అందుబాటులోకి రానున్నాయి.గర్భిణులకు ప్రసూతి సేవలు, ప్రసవానంతర సంరక్షణ, నవజాత శిశువుల కోసం ప్రత్యేక వైద్య సేవలు కూడా కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. డిజిటల్ ఎక్స్‌రే, స్కానింగ్ సదుపాయాలు, 24 గంటల పాథాలజీ ల్యాబ్ వంటి సౌకర్యాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఆస్పత్రి నిర్మాణ పనులను వేగవంతం చేయడంలో ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే

నేపాల్‌లోని త్రిశూలి నదీ లోయలో సంభవించిన వరద ప్రళయం ఊహాతీతమైన విధ్వంసాన్ని సృష్టించింది. కొన్ని రోజుల క్రితం వరకు జనసమ్మర్దంతో కళకళలాడిన పట్టణాలు ఇప్పుడు పూర్తిగా కనుమరుగై, అంతులేని బురద మైదానాలుగా దర్శనమిస్తున్నాయి. ఒక జాతీయ ఛానల్ బృందం నిర్వహించిన ఏరియల్ సర్వే ద్వారా ఈ ఘోర విపత్తు తాలూకు భీకర దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.సదరు బృందం హెలికాప్టర్లో త్రిశూలి నదీ లోయ మీదుగా చైనా సరిహద్దు వరకు ప్రయాణించి వరద నష్టాన్ని అంచనా వేసింది. క్షేత్రస్థాయి పరిశీలన కంటే వైమానిక సర్వే ద్వారానే విధ్వంసం యొక్క తీవ్రత స్పష్టంగా అర్థమవుతోంది. వారం రోజుల క్రితం వరకు భవనాలు, రహదారులు, వంతెనలతో ఉన్న ప్రాంతాలు ఇప్పుడు ఆనవాళ్లు కూడా లేకుండా తుడిచిపెట్టుకుపోయాయి. పైలట్ స్వయంగా చూపిస్తే తప్ప అవి ఒకప్పుడు గ్రామాలు అంటే నమ్మలేని పరిస్థితి నెలకొందని, ఆ ప్రదేశాలన్నీ నదీ గర్భంలా మారిపోయాయని ఆ బృందం వెల్లడించింది. వరద ఉద్ధృతి ఏకంగా మూడు అంతస్తుల ఎత్తుకు చేరి భవనాలను పూర్తిగా ముంచెత్తింది.ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల లోయ పొడవునా ఉన్న డజనుకు పైగా జలవిద్యుత్ ప్రాజెక్టులు ధ్వంసమవడంతో నేపాల్‌లో తీవ్ర విద్యుత్ సంక్షోభం నెలకొంది. త్రిశూలి 3ఏ టన్నెల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నప్పటికీ, అక్కడ టన్నుల కొద్దీ పేరుకుపోయిన బురదను తొలగించడం సహాయక సిబ్బందికి పెను సవాలుగా మారింది.ఈ భీకర విపత్తులో ఇప్పటికే 1,100 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వేల సంఖ్యలో గల్లంతయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే

Sonu Sood: నేపాల్‌లో ప్రకృతి సృష్టించిన విధ్వంసం ఇంకా కళ్లముందే కనిపిస్తోంది. ఎటు చూసినా శిథిలాలు, వరద నీటి ఆనవాళ్లు, దెబ్బతిన్న ఇళ్లు, కనిపించకుండా పోయిన వారి కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలు కనిపిస్తున్నాయి. విపత్తు జరిగి రోజులు గడుస్తున్నా అక్కడి పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోలేదు. ఈ దారుణ పరిస్థితులను ప్రత్యక్షంగా చూసిన బాలీవుడ్ నటుడు సోనూ సూద్ తీవ్రంగా చలించిపోయారు. పరిస్థితిని అంచనా వేసేందుకు స్వయంగా నేపాల్‌కు వెళ్లిన ఆయన, బాధితులకు అండగా నిలవడానికి పిలుపునిచ్చారు. అంతేకాదు అందరం కలిసి నేపాల్‌ను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. విపత్తు ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన సోనూ సూద్ అక్కడి పరిస్థితులను చూసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లను కోల్పోయిన ప్రజల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో వివరించారు. బయట నుంచి చూస్తే విపత్తు తీవ్రతను పూర్తిగా అర్థం చేసుకోవడం కష్టమని, కానీ దగ్గర నుంచి చూస్తే జరిగిన నష్టం ఎంత భారీగా ఉందో తెలుస్తుందని అన్నారు. అందుకే ఈ సమయంలో నేపాల్ ప్రజలకు సహాయం చేసేందుకు ప్రతి ఒక్కరూ తమవంతు ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేశారు. విపత్తు జరిగిన ప్రాంతంలో నీటి ప్రవాహం ఎంత దూరం వరకు చేరిందో ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తోందని సోనూ సూద్ తెలిపారు. తాను నిలబడి ఉన్న ప్రాంతం కూడా అప్పట్లో పూర్తిగా నీటిలో మునిగిపోయి ఉండొచ్చని అన్నారు. నీరు, శిథిలాలు భారీగా ప్రవహించడంతో ప్రజలు ఎత్తైన ప్రాంతాల్లోని శిథిలాల వద్దకు చేరుకోవాల్సి వచ్చిందని, వారం రోజులు దాటినా ఆ ప్రాంతంలో విధ్వంసపు ఆనవాళ్లు అలాగే ఉండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోందన్నారు. బాధితులకు ఎలాంటి సహాయం అందించబోతున్నారనే ప్రశ్నకు కూడా సోనూ సూద్ స్పందించారు. తన స్నేహితులు, బృందంలోని సభ్యులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం అక్కడి ప్రజలకు అత్యవసరంగా ఏం అవసరమో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. తమను సంప్రదిస్తున్న

తాండూరు గ్రామీణం: సర్ ప్రక్రియలో భాగంగా అనామలిస్ ఓటర్లకు తాఖీదుల జారీ, సంబంధిత ధ్రువపత్రాల సేకరణ ప్రక్రియను ఈనెల 10లోగా పూర్తి చేయాలని తాండూరు ఎంపీడీవో విశ్వప్రసాద్ అధికారులను ఆదేశించారు. చెంగోలు, చింతామణి పట్నం, పర్వతాపూర్‌లో ఓటర్లకు తాఖీదుల జారీ ప్రక్రియను బుధవారం పరిశీలించారు. పది రకాల ధ్రువపత్రాల్లో ఒకటి సమర్పించిన ఓటర్ల వివరాలు జాబితాలో పునరుద్ధరించడం జరుగుతుందన్నారు. తాఖీదు అందుకున్న ఓటర్లు తమ గుర్తింపు ధ్రువపత్రాలు తప్పనిసరిగా అందించాలన్నారు. ఉప తహసీల్దార్ సందీప్, పంచాయతీ కార్యదర్శి శివానిరెడ్డి, మహేశ్వరి పాల్గొన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

Gold, Silver Prices: బంగారం, వెండి ధరల తగ్గింపు పర్వం కొనసాగుతోంది. గతంలో పరుగులు పెట్టిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు రికార్డు స్థాయిలో దిగి వస్తున్నాయి. దీంతో మహిళలకు భారీ ఊటర కలిగిస్తున్నాయి. బంగారం, వెండి ధరలు తగ్గుముఖంపై వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ తగ్గింపు దోరణి ఇలాగే కొనసాగితే బాగుండని కోరుతున్నారు. ప్రస్తుతం సెస్టెంబర్ 2న భారీగా తగ్గింది. తులం బంగారంపై ఏకంగా 2,070 రూపాయలు తగ్గింది. వెండిపై 5 వేల రూపాయలు తగ్గింది. సెప్టెంబర్ ఆరంభంలో బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గాయి. ఆభరణాల వ్యాపారుల ప్రకారం.. సెప్టెంబర్ 2వ తేదీన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,52,020గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,39,350 వద్ద ట్రేడవుతోంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. ఆగస్ట్ 24న 1,63,970 ఉండగా, ప్రస్తుతం 1,52,020 వద్ద కొనసాగుతోంది. అలాగే మొత్తంగా 11,950 వరకు తగ్గింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,53,400గా ఉండగా, సెప్టెంబర్ 2 నాటికి 10 గ్రాములకు అది రూ.1,39,350కు పడిపోయింది. అలాగే18 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.1,22,930 నుండి రూ.1,14,020కి పడిపోయింది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడలలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,070 తగ్గి రూ.1,52,020 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,900 తగ్గి రూ.1,39,350 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.1,550 తగ్గి రూ.1,14,020 గా నమోదైంది. వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. ఆగస్టు 24న గ్రాము వెండి ధర రూ.260 ఉండగా, సెప్టెంబర్ 2 నాటికి అది గ్రాముకు రూ.245కు పడిపోయింది. అంటే, సుమారు వారం రోజుల్లో వెండి ధర గ్రాముకు రూ.15 మేర తగ్గిందని
తెలంగాణ వాణిజ్య పన్నుల ఆదాయంలో హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తోంది. రాష్ట్రంలో నమోదైన జీఎస్టీ పన్ను చెల్లింపుదారుల్లో సుమారు 69 శాతం మంది హైదరాబాద్‌లోనే ఉన్నారు. ఆగస్టు నెలలో రాష్ట్ర మొత్తం జీఎస్టీ వసూళ్లలో నగరం ఏకంగా 91.1 శాతం వాటాను నమోదు చేసింది. హైదరాబాద్‌లో ఆగస్టు జీఎస్టీ వసూళ్లు గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 20.53 శాతం పెరిగి రూ.3,956 కోట్లకు చేరాయి. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ గణాంకాల ప్రకారం తెలంగాణలో సుమారు 5.8 లక్షల మంది జీఎస్టీ పన్ను చెల్లింపుదారులు నమోదై ఉన్నారు. వీరిలో దాదాపు 4 లక్షల మంది హైదరాబాద్‌లోనే ఉన్నారు. అంటే రాష్ట్రంలోని ప్రతి 10 మంది నమోదిత జీఎస్టీ చెల్లింపుదారుల్లో ఏడుగురు నగరానికి చెందినవారే. ఆగస్టులో తెలంగాణ మొత్తం రూ.4,341 కోట్ల జీఎస్టీ ఆదాయం సాధించగా.. అందులో హైదరాబాద్ నుంచే రూ.3,956 కోట్లు సమకూరాయి.పన్ను చెల్లింపుదారుల సంఖ్యతో పోలిస్తే హైదరాబాద్ నుంచి వస్తున్న ఆదాయం గణనీయంగా అధికంగా ఉండటానికి నగరంలో అధిక విలువ కలిగిన ఆర్థిక కార్యకలాపాలు కేంద్రీకృతమై ఉండటమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఐటీ, ఐటీఈఎస్, ఔషధ, రియల్ ఎస్టేట్ రంగాలకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉండటంతో పెద్ద మొత్తంలో పన్ను పరిధిలోకి వచ్చే వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో ఒక్కో నమోదిత పన్ను చెల్లింపుదారుపై సగటు జీఎస్టీ వసూళ్లు సుమారు రూ.98,900గా ఉండగా.. రాష్ట్ర సగటు రూ.74,845గా ఉంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లో తెలంగాణ పరోక్ష పన్నుల ఆదాయం కూడా బలమైన వృద్ధిని నమోదు చేసింది. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు జీఎస్టీ, వ్యాట్ కలిపి రూ.36,636 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.31,477 కోట్లతో పోలిస్తే ఇది 16.39 శాతం అధికం. అంటే ఈ ఐదు నెలల్లో అదనంగా రూ.5,159 కోట్ల ఆదాయం సమకూరింది.ఏప్రిల్-ఆగస్టు 2025లో రూ.17,414 కోట్లుగా

Secunderabad: ప్రభుత్వ వైఫల్యాలపై సికింద్రాబాద్‌లో బీఆర్ఎస్ నిరసన ర్యాలీ ఈ వార్తకు సంబంధించిన

Hyderabad: జూబ్లీహిల్స్‌లో ఘనంగా వైఎస్సార్ 17వ వర్ధంతి వేడుకలు! Hyderabad: మాజీ ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా నేడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని శ్రీనగర్ కాలనీ డివిజన్ ఎల్లారెడ్డిగూడలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. డాక్టర్ వైఎస్సార్ గారు ప్రజల సంక్షేమమే పరమావధిగా భావించి, పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, వికలాంగులు, వృద్ధులు, వితంతువుల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన మహానేత అని కొనియాడారు.. రైతులకు ఉచిత విద్యుత్ అందించడంతో పాటు విద్యుత్ బకాయిలను రద్దు చేసి వ్యవసాయ రంగానికి వైఎస్సార్ గారు కొత్త ఊపిరి పోశారని అన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఇందిరమ్మ ఇళ్లు వంటి సంక్షేమ కార్యక్రమాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపారని పేర్కొన్నారు.. వైద్య, ఇంజనీరింగ్ విద్యను పేద, మధ్యతరగతి విద్యార్థులకు చేరువ చేసి, వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసిన గొప్ప దార్శనికుడు వైఎస్సార్ గారు అని అన్నారు. వికలాంగులు, వితంతువులు, వృద్ధులకు అండగా నిలిచి వారి జీవితాల్లో భరోసా నింపిన మహానేత అని కొనియాడారు

రైల్వే శాఖ కీలక అప్డేట్. హైదరాబాద్ వాసులకు రైల్వే తీపి కబురు అందిస్తోంది. హైదరాబాద్ పరిధిలో రైల్వే పైన పెరుగుతున్న ఒత్తిడి వేళ కీలక నిర్ణయం తీసుకుంది. నగర పరిధిలో కొత్తగా మూడు రైల్వే టెర్మినళ్ల ఏర్పాట కు దక్షిణ మధ్య రైల్వే ప్రతిపాదనలు పంపింది. దీని పైన రైల్వే బోర్డు సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ మూడు టెర్మినళ్ల ఏర్పాటు ప్రాంతాలు.. భూ సమీకరణ.. నిధుల అంచనాల పైనా కసరత్తు పూర్తయింది. బెంగళూరు తరహాలో ఈ మూడు టెర్మినళ్లు ఏర్పాటు చేయనున్నారు. దీంతో, పూర్తిగా హైదరాబాద్ లో రైల్వే నిర్వహణ స్వరూపమే మారిపోనుంది.హైదరాబాద్ కు వచ్చే రైళ్ల సంఖ్య పెరుగుతోంది. వివిధ రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కు కనెక్టివిటీ పెరిగింది. నిత్యం లక్షల సంఖ్యలో ప్రయాణీకులు రాక పోకలు సాగిస్తున్నారు. దీంతో.. ప్రస్తుతం ఉన్న సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి పైన ఒత్తిడి పెరుగుతోంది. చర్లపల్లి అందుబాటులోకి వచ్చిన తరువాత కొంత మేర ప్రయోజనం ఉన్నా.. ఇంకా టెర్మినల్స్ అవసరమని దక్షిణ మధ్య రైల్వే గుర్తించింది. అందులో భాగంగా హైదరాబాద్ పరిధిలో మరో మూడు మెగా టెర్మినల్స్ కోసం రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు సమర్పించింది. ఇందు కోసం మూడు ప్రాంతాలను ఎంపిక చేసింది. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ (ట్రిపులార్) మధ్యలో నిర్మించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు సిద్ధం చేసింది. వరంగల్ మార్గంలో ఇప్పటికే చర్లపల్లి టెర్మినల్‌ను నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చింది. వికారాబాద్-ముంబయి మార్గంలో రామచంద్రాపురం మండలంలోని నాగులపల్లి టెర్మినల్ కట్టాలనే డిమాండ్ పైన ఫోకస్ చేసింది. కేసీఆర్ రాజీనామా అస్త్రం..!? సంచలన వ్యూహం- టార్గెట్ రేవంత్..!!రైల్వే శాఖ నిర్ణయంతో... ప్రయాణీకుల కష్టాలకు చెక్దీంతోపాటు మహబూబ్‌నగర్-బెంగళూరు మార్గంలో జూకల్-శంషాబాద్, నిజామాబాద్-నాందేడ్ మార్గంలో డబిల్పుర్-మేడ్చల్ టెర్మినళ్లపై రైల్వే శాఖ దృష్టి పెట్టింది. ఈ విస్తరణ కోసం 250 ఎకరాల భూమిని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇతర దిశల్లో ప్రతిపాదించిన మూడు మెగా టెర్మినళ్ల కోసం

రెజిమెంటల్ బజార్: రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ ఎంజీ రోడ్డులోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు దీపక్ జాన్, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు డాక్టర్ కోట నిలిమ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

కాటేదాన్: రౌడీషీటర్ దారుణ హత్యకు గురైన ఘటన మైలార్ దేవుపల్లి ఠాణా పరిధిలో బుధవారం జరిగింది. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కథనం ప్రకారం... పాతబస్తీ అలినగర్కి చెందిన ఖాజీ సోహెల్(28) ఓ రౌడీ షీటర్. బుధవారం తెల్లవారుజామున పాత కర్నూలు రహదారి మైలార్ దేవులపల్లి పల్లె చెరువు వ్యాపార కూడలి వద్ద గుర్తుతెలియని ముగ్గురు దుండగులు అతడ్ని ద్విచక్రవాహనంపై తీసుకొచ్చారు. మద్యం మత్తులో ఉన్న సోహెల్‌పై 17 సార్లు కత్తితో పొడిచి దాడి చేశారు. దీంతో సోహెల్ అక్కడిక్కడే మృతి చెందాడు. నిందితులు ఎవరా ఆన్నది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

పరకాల నెత్తుటి త్యాగానికి 75 ఏళ్లు రజాకార్ల దాడుల్లో నేలకొరిగిన యోధులు మరో జలియన్‌వాలాబాగ్ ఘటనగా ప్రసిద్ధి పరకాల(వరంగల్): రజాకారుల పాశవిక దాడికి పరకాలలో 15 మంది సమరయోధులు అమరులైన ఉదంతానికి నేటితో (సెప్టెంబరు 2) 75 ఏళ్లు పూర్తయ్యాయి. భారతదేశం బ్రిటీష్ పాలన నుంచి విముక్తి చెంది ఆగస్టు 15 స్వేచ్ఛా స్వాతంత్య్రం పొందితే.. నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణకు విముక్తి లభించలేదు. స్వేచ్ఛా స్వాంతంత్య్రం కోసం తెలంగాణ ప్రాంత ప్రజలు ఉద్యమం వైపు ఉరుకులు తీశారు. ప్రజా సంఘాలు, సాయుధ బలగాలను ఏర్పా టు చేసుకుని సాయుధ పోరాటానికి సిద్ధమయ్యారు. నిజాం సర్కారు ఖాసీంరజ్వీ నేతృత్వంలో రజాకార్ల పేరిట ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంది. వీరు ఉద్యమకారులను, సానుభూతిపరుల కుటుంబాలను అత్యంత దారుణంగా చిత్రహింసలకు గురిచేసి మహిళలు, వృద్ధులు, పిల్లలు అనే తేడా లేకుండా విచక్షణారహితంగా ప్రవర్తించారు. రజాకారుల చర్యలను ఎదుర్కొనేందు కు సమరయోధులు సాయుధబాట పట్టారు. పరకా ల చుట్టుపక్కల గ్రామాలకు చెందిన కటంగూరి కేశవరెడ్డి, ప్రకా్‌షరెడ్డి, ఎస్.మనోహర్‌రావు, కటంగూరి నర్సింహరెడ్డి, వీరగోపాల్‌రావు, చాడ వాసుదేవరెడ్డి, బల్గూరి బుచ్చయ్య, తోపునూరి కోటయ్య, కందుకూ రి జోగారెడ్డి, మేడిపల్లి మల్లయ్య, పాడి నర్సింహారెడ్డి, చంద్రయ్య, చిట్టిరెడ్డి వెంకట్‌రెడ్డి లాంటి పోరాటయోధులు ఒక్కొక్క విభాగానికి నాయకత్వం తీసుకుని ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. 1947 సెప్టెంబరు 2న పరకాలలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ముహూర్తం ఖరారు చేశారు. ఈ కార్యక్రమానికి పరకాల ప్రాంతంలోని ప్రతీ గ్రామం నుంచి వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. పట్టణంలోని చాపలబండ వద్దకు చేరుకుని ఊరేగింపులో పాల్గొన్నారు. పరకాలప్రాంతంలో జరుగుతున్న ఉద్యమాన్ని అణచాలని అప్ప టికే పధకం ప్రకారం నిజాంసేనలు మాటువేసి ఉన్నాయి. పట్టణంలోని తహసీల్ కార్యాలయం వరకు ప్రజలు చేరగానే రజాకార్ మూకలు కత్తులు, బరిసెలు, తల్వార్లతో ఉద్యమకారులను వెంబడించి ఊచకోత కోయగా, నిజాం ఆధీనంలోని పోలీసులు తుపాకులతో విచక్షణారహితంగా ప్రజలపై కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో 15

హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా మచిలీపట్నం వరకు వెళ్లే జాతీయ రహదారి-65కు భారీ అప్‌గ్రేడ్‌కు మార్గం సుగమమైంది. మొత్తం 285 కిలోమీటర్ల మేర రహదారిని ఆరు వరుసలుగా అభివృద్ధి చేసే ప్రతిపాదనకు పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్షిప్ అప్రైజల్ కమిటీ (పీపీపీఏసీ) ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.12,073.99 కోట్లుగా ఉంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును మూడు ప్యాకేజీలుగా విభజించి పనులు చేపట్టనున్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు తర్వాత ఆందోల్ మైసమ్మ ఆలయం సమీపం నుంచి విజయవాడ గొల్లపూడి వరకు 181 కిలోమీటర్ల మార్గాన్ని తొలి ప్యాకేజీగా అభివృద్ధి చేయనున్నారు. హైదరాబాద్ నుంచి నందిగామ వరకు 45 కిలోమీటర్ల భాగం రెండో ప్యాకేజీలో, విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు 59.69 కిలోమీటర్ల మార్గం మూడో ప్యాకేజీలో ఉంటుంది. అధికారుల అంచనాల ప్రకారం తొలి ప్యాకేజీకి రూ.7,321.97 కోట్లు ఖర్చవుతాయి. రెండో ప్యాకేజీకి రూ.2,965.11 కోట్లు, మూడో ప్యాకేజీకి రూ.1,786.91 కోట్ల వ్యయం అవుతుందని అంచనా.. భూసేకరణ, రహదారి నిర్మాణం, జీఎస్టీ తదితర అన్ని వ్యయాలను కలిపితే ఒక్కో కిలోమీటరుకు సగటున రూ.38 కోట్ల వరకు ఖర్చు కానుంది. తెలంగాణలో యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల మీదుగా ఈ రహదారి సాగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల పరిధిలో పనులు కొనసాగనున్నాయి. తెలంగాణ పరిధిలోని రెండు ప్యాకేజీలకు సంబంధించి భూసేకరణ కోసం రూ.1,453.88 కోట్ల వరకు అవసరమవుతుందని అంచనా వేశారు. ఈ రెండు ప్యాకేజీలకు కలిపి 1,387.628 హెక్టార్ల భూమి అవసరం కాగా.. ఇప్పటికే 1,174.295 హెక్టార్ల భూమి అందుబాటులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇంకా 213.33 హెక్టార్ల భూమిని ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరించాల్సి ఉంటుంది. ఇక విజయవాడ-మచిలీపట్నం విభాగంలో 351.185 హెక్టార్ల భూమి అవసరం కాగా.. 344.685 హెక్టార్లు అందుబాటులో ఉంది. దీంతో అదనంగా సుమారు 6.50 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంటుంది. హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం మొత్తం మార్గాన్ని హైస్పీడ్ కారిడార్
పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పేదల నుంచి అఫ్లికేషన్లు తీసుకోవటంతో పాటు ఆగస్టు 28 నుంచి 31 వరకు నాలుగు రోజుల పాటు లబ్ధిదారుల ఎంపిక కోసం డ్రా ప్రక్రియ నిర్వహించారు. లాటరీలో ఇళ్లకు ఎంపికైన వారి పూర్తి వివరాలను హౌసింగ్ బోరు వెబ్సైట్లో పెట్టింది. నియోజకవర్గాల వారీగా దరఖాస్తు నంబరు, పేరు, ప్రస్తుతం ఉంటున్న చిరునామాతో సహా ఏర్పాటు చేసింది. ఎంపికైన వారిపై ఇతర దరఖాస్తుదారులకు ఎవైనా అభ్యంతరాలుంటే తెలియజేసేలా ఆ పక్కనే అవకాశం కల్పించారు.ఇక నేటి నుంచి ఇందిరమ్మ టవర్స్‌కు ఎంపికైన వారి తుది పరిశీలన చేపట్టనున్నారు. మెుత్తం 16 నియోజకవర్గాల్లో హౌసింగ్ బోర్డు అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లనున్నారు. ఏ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇంటికి ఎంపికయ్యారో.. ఆ కుటుంబం గత పదేళ్లుగా అదే నియోజకవర్గంలోనే ఉంటుందా లేదా అని అధికారులు వచ్చి పరిశీలన చేయనున్నారు. ఇందుకు హౌసింగ్ బోర్డు అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి నియోజకవర్గంలో నిర్మించనున్న 480 ఇళ్లకుగాను 600 మందికిపైగా అధికారులు ఎంపిక చేశారు. వీరందరినీ క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు నియోజకవర్గానికి 20 మందికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. రోజుకు కనీసం 150 కుటుంబాల వద్దకు వెళ్లి.. వారి నివాసం నిర్ధారించనున్నారు. నాలుగు రోజుల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నారు.అధికారులు పరిశీలించే అంశాలు ఇవే.. ఇందిరమ్మ ఇళ్లకు ఎంపికైన వారు స్థానికంగానే ఉంటున్నారా లేదా అని అధికారులు నిర్ధారించుకుంటారు. ఆ తర్వాత సదరు ఇంటిని జియోట్యాగ్ చేస్తారు. అఫ్లికేషన్‌లో పేర్కొన్న వివరాలు సరైనవేనా కాదా అనేది చూస్తారు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల వివరాలు పరిశీలిస్తారు. గత పదేళ్లుగా అదే నియోజకవర్గంలో ఉంటున్నాడా లేదా అని దర్యాప్తు చేస్తారు. వివరాలన్నీ అక్కడి నుంచే యాప్‌లో అప్లోడ్ చేస్తారు.ప్రస్తుతం నియోజకవర్గానికి 480 ఇళ్లను నిర్మిస్తుంటే.. అంతే మందిని ఎంపిక చేశారు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇటీవలే 1,000 రోజుల పాలనను పూర్తి చేసుకుంది. ప్రజాప్రభుత్వం పాలనలో సమూల మార్పులు తీసుకువచ్చామని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చామని, సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇచ్చామని ప్రభుత్వం చెబుతోంది. రైతులు, మహిళలు, యువత కోసం అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తోన్నట్లు చెప్పుకొచ్చింది. తెలంగాణ చరిత్రలో ఓ నూతన అధ్యాయాన్ని లిఖించామని స్పష్టం చేస్తోంది.దీనికి భిన్నంగా స్పందిస్తోంది.. బీజేపీ రాష్ట్రశాఖ. రేవంత్ రెడ్డి 1,000 రోజుల పాలన మొత్తం దోపిడీపూరకమంటూ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికార పార్టీ నాయకులు వందల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డారని విమర్శిస్తోంది. గతంలో ఎప్పుడూ లేనంతగా అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని ధ్వజమెత్తుతోంది. దీనిపై నిరసన కార్యక్రమాలను చేపట్టింది కూడా. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నాలకు తెర తీసింది.ఈ క్రమంలో.. నగరం అంతటా బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన పోస్టర్లను అతికించాయి. హైదరాబాద్ వ్యాప్తంగా అత్యంత రద్దీగా ఉండే దాదాపు 500కు పైగా ప్రాంతాలలో ఈ పోస్టర్లు కనిపించాయి. కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు, గాంధీ భవన్ పరిసరాల్లో ఈ పోస్టర్లను అంటించారు బీజేపీ నాయకులు. అసెంబ్లీ, రవీంద్ర భారతి, లక్డీకాపుల్ బస్ స్టాప్, ముఖ్యమంత్రి అధికారిక నివాసం వెలుపల పోస్టర్లు రాత్రికి రాత్రే వెలిశాయి.సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు అరుదైన ఘనత..: దేశంలోనేపలు ప్రధాన రహదారులు, జంక్షన్లు, రద్దీగా ఉండే బస్ స్టాండ్లు, మెట్రో రైలు పిల్లర్ల వద్ద కూడా స్థానిక బీజేపీ శ్రేణులు ఈ నిరసన పోస్టర్లను ప్రదర్శించాయి. దీంతో హైదరాబాద్ లో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. రెండు పార్టీల మధ్య ఘర్షణపూరిత వాతావరణానికి దారితీసింది. కాంగ్రెస్ ఇచ్చిన కీలక గ్యారెంటీల అమలుపై నిరసన తెలపడమే తమ ప్రధాన లక్ష్యమని బీజేపీ నాయకులు స్పష్టం చేస్తోన్నారు.ప్రజల పక్షాన ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడతామని బీజేపీ స్పష్టం చేసింది. ఈ

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యలను అధిగమించడానికి ప్రత్యేక క్యారేజ్‌వేల ఏర్పాటుకు పోలీసు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ట్రాఫిక్ కష్టాలు దూరం చేసేందుకు ప్రయత్నాలు హైదరాబాద్ సిటీ: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యలను అధిగమించడానికి ప్రత్యేక క్యారేజ్‌వేల ఏర్పాటుకు పోలీసు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. దీని వల్ల వాహనాలు సులభంగా వెళ్లడానికి వీలవుతుందని భావిస్తున్నారు. ఈ మేరకు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ సన్‌ప్రీత్‌సింగ్, ట్రాఫిక్ డీసీపీ సంక్రాంతి రవికుమార్, అదపు డీసీపీ జి.హనుమంతరావు, మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ కె.చంద్రశేఖర్ రెడ్డి పలు ప్రాంతాల్లో మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముఖ్యంగా ప్రజా రవాణాకు ప్రాధాన్యత ఇవ్వడం, యూటర్న్లు, జంక్షన్ల ఆప్టిమైజేషన్ ద్వారా ట్రాఫిక్ ఆలస్యాన్ని తగ్గించడంపై ప్రత్యేక దృష్టి సారించారు. కేపీహెచ్‌బీ, మాదాపూర్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్ల పరిధిలోని జేఎన్టీయూ నుంచి సింక్రోనీ (రాయదుర్గం) మెట్రోస్టేషన్ మార్గంలో రద్దీ ఎక్కువగా ఉండడంతో ఇక్కడ ప్రత్యేక క్యారేజ్‌వే ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. చర్లపల్లి-తిరుచానూరు మధ్య 2 ప్రత్యేక రైళ్లు

Hyderabad Real Estate: హైదరాబాద్ నగరం రోజురోజుకూ విస్తరిస్తోంది. నగరంలో భూముల ధరలు ఇప్పటికే చాలా ప్రాంతాల్లో భారీగా పెరిగాయి. దీంతో పెట్టుబడిదారులు ఇప్పుడు నగరానికి సమీపంలోని అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌కు సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న వికారాబాద్ ప్రాంతం కూడా రియల్ ఎస్టేట్‌లో ఆసక్తిని పెంచుతోంది. హైదరాబాద్ చుట్టూ రోడ్లు, హైవేలు, రవాణా సదుపాయాలు మెరుగుపడుతున్నాయి. రీజినల్ రింగ్ రోడ్, ఫ్యూచర్ సిటీ, కొత్త రహదారులు, మెట్రో విస్తరణ వంటి ప్రాజెక్టులు నగర భవిష్యత్ అభివృద్ధిలో కీలకంగా మారే అవకాశం ఉంది. ఈ అభివృద్ధి క్రమంగా నగర శివారు ప్రాంతాలకు కూడా విస్తరించవచ్చు. ప్రధాన ప్రాజెక్టులకు చాలా దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికే భూముల ధరలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల కొంతమంది పెట్టుబడిదారులు ఇంకా అభివృద్ధి ప్రారంభ దశలో ఉన్న ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. రోడ్డు సౌకర్యాలు, రవాణా, ఇతర మౌలిక వసతులు పెరిగితే భవిష్యత్తులో అక్కడ భూములకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. వికారాబాద్ హైదరాబాద్‌కు దగ్గరగా ఉండటంతో పాటు ప్రకృతి అందాలకు కూడా ప్రసిద్ధి చెందింది. అనంతగిరి కొండలు, పచ్చని ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలు ఈ ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి వికారాబాద్‌కు రహదారి కనెక్టివిటీ మరింత మెరుగైతే ప్రయాణం సులభమవుతుంది. దీంతో ఉద్యోగులు, వ్యాపారులు, పర్యాటకులు ఈ ప్రాంతానికి ఎక్కువగా రాకపోకలు సాగించే అవకాశం ఉంది. రవాణా సౌకర్యాలు పెరిగినప్పుడు నివాస ప్రాంతాలు, చిన్న వ్యాపారాలు, ఇతర వాణిజ్య కార్యకలాపాలు కూడా అభివృద్ధి చెందవచ్చు. హైదరాబాద్ ప్రధాన ప్రాంతాలతో పోలిస్తే వికారాబాద్ పరిసరాల్లో కొన్ని చోట్ల భూములు తక్కువ ధరలకు లభించే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో 120 గజాల ప్లాట్లు రూ.10 లక్షల లోపు కూడా ఉన్నట్లు సమాచారం. అయితే ఇది అన్ని ప్రాంతాలకు వర్తించదు. రోడ్డు పక్కన ఉన్న భూములు, పట్టణానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Gold Rate Today: పసిడి ప్రియులకు భారీగా ఊరటనిచ్చే వార్త. బంగారం కొనాలనుకునేవారికి ఇది సరైన సమయం అని చెప్పాలి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు భారీగా దిగివస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పతనం అయ్యాయి. కిలో వెండిపై ఏకంగా 10,000 తగ్గింది. 24క్యారెట్ల పసిడిపై రూ. 2,680 మేర దిగివచ్చింది. తాజా ధరల మార్పుతో హైదరాబాద్ లో పది గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,54,090కి దిగి వచ్చింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,41,250కి చేరింది. అదే విధంగా కిలో వెండి ధర రూ.10,000 మేర తగ్గింది. కిలో వెండి ధర రూ. 2,50,000 వద్ద స్థిర పడింది. గత 3 రోజుల్లోనే 10 గ్రాముల బంగారం ధర రూ. 6,000 మేర పైగా తగ్గింది. ఇరాన్ పై అమెరికా మళ్లీ సైనిక దాడులు ప్రారంభించడమే ఈ భారీ తగ్గుదలకు కారణమని చెబుతున్నారు మార్కెట్ విశ్లేషకులు. ఈ దాడుల ప్రభావంతో ముడి చమురు ధరలు పెరుగుతుండటంతో పెట్టుబడిదారులు బంగారం నుంచి తమ పెట్టుబడులను ఇతర మార్గాలకు మళ్లిస్తున్నట్లు బులియన్ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లపై అంచనాలు తగ్గడం, డాలర్ కదలికలు కూడా ధరలపై ప్రభావం చూపాయని చెప్పాలి. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధరలు కుప్పకూలాయి. స్పాట్ గోల్డ్ ఔన్సుపై ఏకంగా 106 డాలర్లు తగ్గింది. దీంతో 4,323 వద్ద ట్రేడ్ అవుతోంది. స్పాట్ సిల్వర్ కూైడా 3.20శాతం నష్టపోయింది. దీంతో ఔన్సు వెండి 64 డాలర్ల వద్ద కొనసాగుతోంది. Disclaimer: ఈ కథనంలో పొందుపరిచిన

హైదరాబాద్: వరుస వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు ఇన్స్పెక్టర్ను నియమించడంలో తాత్సారం జరుగుతుంది. వారం రోజులు గడుస్తోన్నా ఇన్స్పెక్టర్ నియామకంలో ఉన్నతాధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఏ అధికారి వచ్చినా 10 వారాలు కూడా ఉండకుండా సస్పెన్షన్లకు గురవుతుండడంతో ఈసారి ఎస్‌హెచ్‌వో నియామకంలో మరింత పారదర్శకత ఉండేలా చేపట్టాలని యోచిస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నివాసముండే పరిధి ఠాణాలోనే వరుస వివాదాలు చోటుచేసుకుంటుండడంపై ఉన్నతాధికారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నివాసంతో పాటు సీఎం క్యాంప్ కార్యాలయ కిందికి వచ్చే ఈ పోలీస్‌స్టేషన్‌లో ఇన్స్పెక్టర్లు విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యాన్ని కనబరుస్తుండడంతో పాటు అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ పోలీసు శాఖకే మచ్చతెచ్చారు. దీంతో ఇటీవల లైంగిక వేధింపుల కేసులో ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌రెడ్డిని సస్పెండ్ చేసి, ఆయన స్థానంలో ముత్తుయాదవ్ను నియమించారు. ఆయన కూడా విధి నిర్వహణలో తీవ్ర నిరక్ష్యాన్ని కనబరచడమే కాకుండా మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌పై చర్యలు తీసుకోవడంలోనూ, ఆయనను అరెస్టు చేయడంలోనూ అశ్రద్ధ వహించారు. బాధితులకు న్యాయం చేయకుండా నిందితులు పారిపోవడానికి ఆస్కారం కలిగించారనే ఆరోపణలతో గత నెల 25న ముత్తుయాదవ్‌పై వేటుపడింది. అప్పటి నుంచి ఇక్కడ ఇన్స్పెక్టర్ను నియమించడానికి ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. జల్లెడపడుతున్న నిఘా వర్గాలు సీఎం రేవంత్‌రెడ్డి నివాసం ఉండే ఈ ఠాణాకు సమర్ధుడైన ఇన్స్పెక్టర్ను నియమించాలని, ఆ స్థాయి అధికారి కోసం నిఘా వర్గాలు జల్లెడపడుతున్నాయి. అటు ఇంటెలిజెన్స్, ఇటు ఎస్బీ ఈ ఠాణాకు ఇన్స్పెక్టర్ను నియమించడంలో కీలకపాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎప్పటిలాగే ఇన్స్పెక్టర్ నియామకంలో పాత్ర ఉండే అధికారులను పక్కనబెట్టి ఈసారి గుర్తించిన ఉన్నతాధికారుల ప్రమేయంతో ఈ పోస్టును భర్తీ చేయాలని యోచిస్తున్నారు. అందుకే నియామకంలో ఆలస్యం జరుగుతుందని పేర్కొంటున్నారు. దగ్గరపడుతున్న వినాయక చవితి వేడుకలు వినాయక చవితి వేడుకలు దగ్గర పడుతుండడంతో జూబ్లీహిల్స్ ఠాణాకు ఇంకా ఇన్స్పెక్టర్ను నియమించకపోవడంతో వినాయక మండపాల కమిటీ ప్రతినిధుల సమావేశాలు, మైత్రి

Vizianagaram: సీతంలో ఇండోసోల్ పూల్ క్యాంపస్ డ్రైవ్ - అర్హతలు ఇవే! Vizianagaram: సత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పూల్ క్యాంపస్ నియామక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. హైదరాబాద్‌కు చెందిన ఎస్‌ఎస్‌ఎస్‌వీ సొల్యూషన్స్ సహకారంతో సెప్టెంబర్ 3న ఉదయం 9 గంటలకు సీతం కళాశాల ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. బీటెక్‌లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్‌తో పాటు డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు హాజరుకావచ్చు. 2023 నుంచి 2026 వరకు బ్యాచ్‌లకు చెందిన విద్యార్థులతో పాటు ఇప్పటికే కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు కూడా అర్హులని కళాశాల యాజమాన్యం తెలిపింది. ఎంపికైన వారికి విద్యార్హతను బట్టి వార్షిక వేతన ప్యాకేజీ అందించనున్నారు. బీటెక్ అభ్యర్థులకు రూ.2.16 లక్షలు, డిగ్రీ, డిప్లొమా అభ్యర్థులకు రూ.1.90 లక్షలు, ఐటీఐ అభ్యర్థులకు రూ.1.80 లక్షలు వేతనంగా నిర్ణయించినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రముఖ సోలార్ సంస్థలో ఉద్యోగం పొందేందుకు ఈ నియామక కార్యక్రమం మంచి అవకాశమని సీతం కళాశాల డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణరావు, ప్రిన్సిపల్ డాక్టర్ రామ్మూర్తి తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు అవసరమైన ధ్రువపత్రాలతో సెప్టెంబర్ 3న ఉదయం 9 గంటలకు హాజరుకావాలని సూచించారు. మీడియా రంగంలో 9 సంవత్సరాల విస్తృతమైన క్షేత్రస్థాయి అనుభవంతో.. సమకాలీన రాజకీయ, సామాజిక పరిణామాలపై నిశిత పరిశీలన కలిగిన విజయనగరం ‘స్టాఫ్ రిపోర్టర్’

కడపలో సుమారు రూ.12 కోట్ల వ్యయంతో ఈ స్టార్టప్ హబ్‌ను నిర్మించారు. 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో జీ+3 నమూనాలో రూపొందించిన ఈ భవనంలో యువ పారిశ్రామికవేత్తలకు అవసరమైన ఆధునిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఈ స్టార్టప్ హబ్ ప్రారంభం కానుంది. జిల్లా యంత్రాంగం ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై దృష్టి సారించింది. రాయలసీమలో సాంకేతిక, పారిశ్రామిక రంగాలకు కొత్త ఊపునిచ్చే కేంద్రంగా దీనిని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. హై-స్పీడ్ ఇంటర్నెట్, ఆధునిక వర్క్ స్పేస్‌లు, ప్రొటోటైపింగ్ ల్యాబ్‌లు, సాంకేతిక సాఫ్ట్వేర్ టూల్స్ వంటి సదుపాయాలు అందుబాటులో ఉండనున్నాయి. కొత్త ఉత్పత్తులు, సాంకేతిక పరిష్కారాలను రూపొందించే యువతకు ప్రయోగాత్మక వాతావరణం కల్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ కేంద్రం ముఖ్య ఉద్దేశం కేవలం ఉద్యోగ అవకాశాల సమాచారాన్ని అందించడం కాదు. యువతను స్వయం ఉపాధి, స్టార్టప్‌ల వైపు మళ్లించి భవిష్యత్‌లో ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి తీసుకెళ్లడం లక్ష్యంగా పెట్టుకున్నారు. కొత్త వ్యాపార ఆలోచన ఉన్న విద్యార్థి లేదా యువకుడు ప్రారంభ దశలో ఎదుర్కొనే అనేక సమస్యలకు ఇక్కడ మార్గదర్శకత్వం లభించే అవకాశం ఉంది. ఆలోచనను ఎలా అభివృద్ధి చేయాలి, వ్యాపార ప్రణాళికను ఎలా సిద్ధం చేయాలి, మార్కెట్ అవసరాలను ఎలా అర్థం చేసుకోవాలి వంటి అంశాలపై నిపుణుల సహకారం అందించనున్నారు. ముఖ్యంగా చిన్న ఆలోచనతో ప్రారంభమైన ప్రాజెక్టును వాణిజ్యపరంగా విజయవంతమైన సంస్థగా మార్చేందుకు అవసరమైన ఎకోసిస్టమ్‌ను ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. స్టార్టప్ ప్రారంభించాలనే ఆసక్తి ఉన్న యువతకు సరైన మార్గదర్శకత్వం ఎంతో కీలకం. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రముఖ విద్యాసంస్థలు, పరిశ్రమలకు చెందిన నిపుణులతో మెంటార్షిప్ కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు. దేశంలోని ప్రముఖ ఐఐటీలు, ఐఐఎంలకు చెందిన నిపుణులతో పాటు గ్లోబల్ టెక్నాలజీ రంగంలో అనుభవం ఉన్న వ్యక్తుల ద్వారా యువతకు దిశానిర్దేశం చేయనున్నారు. విజయవంతమైన వ్యాపార నమూనాలు

వేగంగా ఓల్డ్‌సిటీ మెట్రో కారిడార్ పనులు మొత్తం 888 ఆస్తుల్లో ఇప్పటి వరకు 833 సేకరణ ఈ నెలాఖరులోగా పూర్తి చేసేందుకు చర్యలు మరోవైపు ముమ్మరంగా కూల్చివేతలు హైదరాబాద్ సిటీ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మెట్రో రెండో దశ విస్తరణలోని ఓల్డ్‌సిటీ కారిడార్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. నిర్మాణంలో భాగంగా కావాల్సిన భూసేకరణ ప్రక్రియ చివరి దశకు చేరింది. మరో 55 ప్రభావిత ఆస్తులను తీసుకుంటే కారిడార్ నిర్మాణానికి అడుగులు పడినట్లవుతుందని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) అధికారులు చెబుతున్నారు. నగరంలో రెండో దశ మెట్రో విస్తరణలో భాగంగా కారిడార్-6 కింద ఎంజీబీఎస్ - చాంద్రాయణగుట్ట వరకు (7.5 కిలోమీటర్లు) నిర్మాణాన్ని చేపడుతున్న విషయం తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ వెంచర్ (జేవీ) ప్రాతిపదికన రూ.2,741 కోట్లతో నిర్మాణాన్ని పూర్తి చేయనున్నాయి. అయితే నాగోల్ - శంషాబాద్ ఎయిర్‌పోర్టు (36.8 కిలోమీటర్ల) మార్గం తర్వాత పాతనగరం కారిడార్‌పైనే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ‘ఇది ఓల్డ్‌సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పలు సభల్లో చెబుతూ వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రెండో దశ ప్రాజెక్టుకు సంబంధించిన డిటైల్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)కు అనుమతి ఇచ్చిన వెంటనే ఈ మార్గంలోని పనులను ప్రారంభించేందుకు ఎదురుచూస్తోంది. ఇదిలా ఉండగా, ఫలక్‌నుమా ఆర్టీసీ ప్రాంగణంలో 2024 మార్చి 8న శంకుస్థాపన చేశారు. పరిహారం.. వెంటనే తొలగింపు ఇప్పటివరకు సేకరించిన ఆస్తుల్లో 60 శాతం కమర్షియల్ భవనాలు, 40 శాతం నివాస గృహాలున్నాయి. అయితే సేకరించిన ఆస్తులకు సంబంధించిన యజమానులకు పరిహారం అందిస్తున్న అధికారులు వెంటవెంటనే తొలగింపు పనులు చేపడుతున్నారు. ఆయా దారుల్లో వాహనదారుల రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా చూస్తూ పొక్లెయినర్లతో తొలగిస్తూ శిథిలాలను దూర ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు విద్యుత్ స్తంభాలు, వాటర్పైపులకు ప్రమాదం వాటిల్లకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాగా, తొలగింపు పనులను వివిధ శాఖల అధికారులు దగ్గరుండి
చేపలకు ఆహారం వేస్తామని చెప్పి ఇంటికే టోకరా.. 6 ఏళ్ల తర్వాత బయటపడ్డ మోసం హైదరాబాద్‌లోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఎం. నవీన్ కుమార్ కుటుంబం నివసిస్తోంది. మార్చి 2020లో కరోనా మొదటి వేవ్ సమయంలో వీరు తమ స్వగ్రామానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇదే అదనుగా భావించిన.. రామశర్మ, అతని భార్య ప్రమీలారాణి దంపతులు రంగంలోకి దిగారు. మీరు ఊరికి వెళ్తే ఇంట్లోని అక్వేరియం ఉంది కదా.. మరి ఆ చేపలకు ఫుడ్ ఎవరు వేస్తారు? అవి చనిపోతాయి కదా.. అంటూ అమాయకపు కన్నీరు కార్చారు. తాము ఎంతో నమ్మకంగా ఉంటామని చెప్పి బాధితుల ఇంటి తాళాలు తీసుకున్నారు. తాళాలు చేతికి చిక్కగానే ఆ దంపతులు తమ అసలు రంగు బయటపెట్టారు. ఇంట్లోని బీరువాలో ఉన్న బాధితురాలి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, కరెంట్ బిల్లులను దొంగిలించారు. ఆమె భర్తే తన సొంత ఇంటిని భార్యకు అద్దెకు ఇచ్చినట్లుగా ఫేక్ రెంటల్ అగ్రిమెంట్లు సృష్టించి.. ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేశారు. ఆ పత్రాలతో ఆన్లైన్ పోర్టల్‌లో ఏకంగా శ్రీ గురుదత్త లక్ష్మీనరసింహ గురువాంబిక శక్తిపీఠం పేరుతో ఓ ఆధ్యాత్మిక పీఠాన్ని రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ వార్తకు సంబంధించిన

నగరంలోని చందానగర్‌లో భారీగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లను ఆర్సీ పురం ఎస్ఓటి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తనిఖీలు చేపట్టగా.. ఈ ఇంజెక్షన్లతో ఇద్దరు వ్యక్తులు దొరికారు. హైదరాబాద్: నగరంలోని చందానగర్‌లో భారీగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లను ఆర్సీ పురం ఎస్ఓటి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు చందానగర్ పీజేఆర్ స్టేడియం వద్ద చేపట్టిన తనిఖీల్లో స్టెరాయిడ్ ఇంజెక్షన్లతో ఇద్దరు వ్యక్తులు పోలీసులకు చిక్కారు. వారి నుంచి రూ. లక్ష విలువ చేసే ఈ ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకుని, నిందితులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చట్టవిరుద్ధంగా స్టెరాయిడ్లు విక్రయిస్తున్న వీరిని సరసాయి రామ్, కుంచాల రవీంద్రలగా గుర్తించారు. నిందితుల దగ్గర మెఫెంటెరమైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు (Wofen 10ml) ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఇద్దరి మధ్య లావాదేవీలు అన్నీ ఆన్లైన్ పేమెంట్స్ ద్వారానే జరిగినట్లు వెల్లడించారు. అయితే ఈ విక్రయాల్లో వినియోగదారులుగా ఉన్న దీపక్, సాయి ప్రసాద్, షకీల్, కిషోర్, నితీష్ అనే మరో ఐదుగురు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది

హైదరాబాద్: ఈసారి భాగ్య నగర పరిధిలో లక్షా నలభై వేల గణేష్ మండపాల సిద్ధమవుతున్నాయని భాగ్యనగర్ ఉత్సవ కమిటీ స్పష్టం చేసింది. ఈ మేరకు వాటి నిమజ్జనాలకు అవసరమయ్యే ఏర్పాట్లను చేయాలని ప్రభుత్వాన్ని కోరామని తెలిపింది. బడ్జెట్ కేటాయిపులో ప్రభుత్వం స్పీడ్ పెంచాలని మంత్రి దృష్టికి తీసుకెళ్ళామని, ఎప్పటిలాగే అన్నీ చెరువులు, వినాయక సాగర్‌లో నిమజ్జనం కొనసాగుతుందని బాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి రావి నూతుల శశిధర్ సాక్షి టీవీకి తెలిపారు. ‘అధికారుల తప్పుడు నివేదిక కారణంగా హైకోర్టు వినాయక సాగర్‌పై స్టే ఇచ్చింది. ఎక్కడ వినాయక నిమజ్జనం వల్ల పొల్యూషన్ జరిగినట్లు సరైన ఆధారాలు లేవు. కావాలనే కొందరు అధికారులు హిందూ పండుగలను ఆంక్షలు పెట్టాలని చూస్తున్నారు. కాప్రా చెరువుతో పాటు హైడ్రా డెవలప్ చేసిన అన్నీ చెరువుల్లో నిమజ్జనం చేస్తాం. అడ్డుకోవడానికి హైడ్రాకు ఎలాంటి అధికారం లేదు. చెరువులకు ఓనర్లు ప్రజలు.. అధికారులు, నాయకులు కాదు. చెరువుల్లో నిమజ్జనం చేయడం మా సంప్రదాయం. అందుకే అన్నీ చెరువుల్లో నిమజ్జనం కొనసాగిస్తాం. అడ్డుకోవాలని చూస్తే.. పరిణామాలు మరోలా ఉంటాయి’ అని పేర్కొన్నారు. ఇదీ చదవండి: భారీ పెరిగిన గణేష్ విగ్రహాల ధరలు ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు) తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు) హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు) అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు) భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్ సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ