
హైదరాబాద్ పాతబస్తీలోని పటేల్ మార్కెట్లో దుకాణదారుల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దుకాణం ముందు వస్తువుల డిస్ప్లే విషయంలో మొదలైన చిన్న వివాదం చివరకు కత్తులు, ఇనుప రాడ్లు, కర్రలతో దాడులు చేసుకునే స్థాయికి చేరింది. ఒక దుకాణదారుడికి, పక్కనే ఉన్న మరో దుకాణం యజమానులు, సిబ్బందికి మధ్య వస్తువుల డిస్ప్లే విషయంలో మొదట మాటామాటా జరిగింది.





