
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Head constable bitten by krait snake in madhya pradesh: ఇటీవల భారీ వర్షాలు కురుస్తుండటంతో పాములు తరచుగా జనావాసాల్లోకి వస్తున్నాయి. కొన్నిసార్లు అవి షూస్ లలో, మంచాలలో దాక్కుంటున్నాయి. అంతే కాకుండా కోబ్రాలు ఇంట్లో చీకటిగా ఉండే ప్రదేశాల్లో ఎక్కువగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో మధ్య ప్రదేశ్ లోని గ్వాలీయర్ లో ఒక హెడ్ కానిస్టేబుల్ ఆఫీస్ లో ఉండగా పాము కాటుకు గురయ్యాడు. ఈ ఘటన వార్తలలో నిలిచింది.
మధ్య ప్రదేశ్ లోని గ్వాలియర్‌లోని బిజౌలీ పోలీస్ స్టేషన్ లో ఒక హెడ్ కానిస్టేబుల్ పూరణ్ సింగ్ కు రెండు సార్లు పాము కాటుకు గురయ్యాడు. మంచంలో నక్కిన పాము కానిస్టేబుల్ ను కాటు వేసింది. వెంటనే అక్కడున్న సిబ్బంది కాటేసిన పామును పిక్ తీసి ఏఐ తో అది ఏ పాము అని విచారణ చేశారు.
ఆ తర్వాత దాని సూచనల మేరకు పాముకాటు ప్రదేశాన్ని సబ్బుతో నీట్ గా కడిగేశారు. వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి వెళ్లారు. వైద్యులకు కరిచిన పాము పిక్స్ చూపించారు. దీంతో వైద్యులుదానికి సరిపడా యాంటి వెనమ్ ను అతనికి ఎక్కించారు. ఈ నేపథ్యంలో హెడ్ కానిస్టేబుల్ కు వెంటనే వైద్యం అందండంతో అతను ప్రాణాపాయం నుంచి బైటపడ్డాడు. ఈ ఘటన గురించి తెలుసుకున్న గ్వాలియర్ ఎస్పీ కూడా ఆయనను పరామర్శించడానికి ఆసుపత్రికి చేరుకున్నారు.
Read more: Pawan kalyan: చంద్రగిరి సమీపంలో ఏనుగుల సంచారం.. రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్.. అధికారులకు కీలక ఆదేశాలు..!
మరోవైపు ఆ పామును రక్షించి అడవిలోకి వదిలివేశారు. సిబ్బంది సమయస్ఫూర్తి , సకాలంలో అందించిన వైద్య సహాయం హెడ్ కానిస్టేబుల్ ప్రాణాలను కాపాడారని ఎస్పీ ప్రశంసలు కురిపించారు. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.




