
ప్రారంభంలో పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చిన ‘హనుమాన్ అంశ్’కు తొలిరోజుల్లో పెద్దగా స్పందన రాలేదు. అయితే ప్రేక్షకుల నుంచి వచ్చిన పాజిటివ్ మౌత్ టాక్తో సినిమాకు క్రమంగా ఆదరణ పెరిగింది. దీంతో థియేటర్లలో స్క్రీన్ల సంఖ్య కూడా పెరిగింది. తక్కువ బడ్జెట్ సినిమా అయినప్పటికీ ప్రేక్షకుల ఆదరణతో భారీ వసూళ్లను రాబట్టింది. తాజా ట్రేడ్ రిపోర్టుల ప్రకారం, ఈ సినిమా భారత్లో రూ.214 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ సాధించింది. ప్రపంచవ్యాప్తంగా సినిమా గ్రాస్ వసూళ్లు సుమారు రూ.268 కోట్లకు చేరుకున్నాయి. మరో రిపోర్టు ప్రకారం ప్రపంచవ్యాప్తంగా రూ.236 కోట్లకు పైగా వసూళ్లు నమోదయ్యాయి. వేర్వేరు ట్రేడ్ ట్రాకర్ల లెక్కల్లో స్వల్ప తేడాలు ఉన్నప్పటికీ, రూ.2 కోట్ల బడ్జెట్తో పోలిస్తే సినిమా సాధించిన వసూళ్లు మాత్రం అసాధారణంగా ఉన్నాయి.





