
Asia Cup trophy| ఇంటర్నెట్‌డెస్క్‌: ఆసియాకప్‌ టీ20 టోర్నీలో ఒక్క ఓటమి కూడా లేకుండా అదరగొట్టిన భారత మహిళల జట్టు వరుసగా ఎనిమిదోసారి ఛాంపియన్‌గా నిలిచింది. అయితే ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) అధ్యక్షుడు మోసిన్‌ నఖ్వీ (Mohsin Naqvi) నుంచి ట్రోఫీ అందుకోవడానికి మన అమ్మాయిలు నిరాకరించారు. ఈ వ్యవహారంపై భారత మహిళల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ అమోల్ మజుందార్ స్పందించారు. ‘‘భారత్‌ జట్టు ఆసియా కప్ ఛాంపియన్‌ (Asia Cup trophy). బోర్డుపై పెద్ద అక్షరాలతో అందరికీ ఆ విషయం కనిపించింది.. అది చాలు. మన జట్టు ఛాంపియన్‌గా నిలిచినందుకు సంతోషం. ట్రోఫీ తీసుకున్నా తీసుకోకపోయినా మాకు పట్టింపు లేదు. నఖ్వీ నుంచి ట్రోఫీ తీసుకోకూడదనేది బీసీసీఐ వైఖరి’’ అని మజుందార్‌ అన్నారు. ఇదిలా ఉంటే.. గత ఏడాది పురుషుల ఆసియా కప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టు నఖ్వీ (పాక్‌ మంత్రి, ఆ దేశ క్రికెట్‌ బోర్డు ఛైర్మన్‌) నుంచి ట్రోఫీ అందుకోవడానికి నిరాకరించడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఆదివారం ఆసియా కప్‌ మహిళల క్రికెట్‌ టోర్నీ బహుమతి ప్రదానోత్సవానికి కూడా నఖ్వీ (Mohsin Naqvi) హాజరు కావడంతో అదే దృశ్యం పునరావృతమైంది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్‌ 72 పరుగుల తేడాతో లంకను చిత్తు చేసిన సంగతి తెలిసిందే. షెఫాలి వర్మ, స్మృతి మంధాన, తెలుగమ్మాయి శ్రీచరణి , దీప్తి శర్మ మెరుపులతో లంక జట్టుకు ఓటమి తప్పలేదు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌ను టీమ్‌ఇండియా ఘనంగా ఆరంభించింది.





