
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Viral Latest Pic: ఈ రోజుల్లో పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ (Pre-Wedding Shoot) అనేది ఒక తప్పనిసరి తంతుగా మారిపోవడం విశేషం.. పెళ్లి ఎంత ఘనంగా చేసుకుంటున్నారనే దానికంటే.. ప్రీ వెడ్డింగ్ షూట్ ఎంత వెరైటీగా ప్లాన్ చేశారనేదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.. ఇరుగు పొరుగు వారు ఆశ్చర్యపోయేలా.. సోషల్ మీడియాలో తమదే బెస్ట్ కపుల్ అనిపించుకునేలా యువత రకరకాల సాహసాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఒక జంట చేయించుకున్న ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
సాధారణంగా ప్రీ వెడ్డింగ్ ఫోటోలు అనగానే.. పచ్చని పొలాలు, సముద్ర తీరాల్లో రొమాంటిక్‌గా దిగుతుంటారు. కానీ, వైరల్ అవుతున్న ఈ తాజా ఫోటోలో ఒక జంట అద్భుతమైన ఫార్మల్.. ఖరీదైన పార్టీ వేర్ దుస్తులు ధరించి.. ఒక అందమైన కొలను దగ్గర నిల్చుని ఉండడం మీరు ఈ ఫోటోల్లో చూడొచ్చు. అందులో కాబోయే వధువు చాలా అందంగా ముస్తాబై.. కెమెరా వైపు చూస్తూ ఎంతో ఆకర్షణీయంగా చిరునవ్వుతో ఫోజులిచ్చింది.. ఇక్కడి వరకు చూస్తే ఇదొక అద్భుతమైన ఫోటో అనిపిస్తుంది. కానీ, ఆమె పక్కనే ఉన్న కాబోయే వరుడి స్టిల్ చూస్తే మాత్రం ఎవరికైనా ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.
ఆ యువకుడు వధువుకు కొద్దిగా దూరంగా నిలబడి ఉండడం మీరు క్లియర్‌గా చూడొచ్చు.. అంతేకాకుండా ఏకంగా ఆ కొలనులోకి మూత్ర విసర్జన (Urinating) చేస్తున్నట్లుగా కెమెరాకు స్టిల్ ఇచ్చాడు. వినడానికి వింతగా అనిపించినా.. ఫోటోలో ఉన్నది ఇదే.. విభిన్నంగా కనిపించాలన్న ఉద్దేశ్యమో.. లేదా నెటిజన్ల దృష్టిని ఆకర్షించాలన్న ఆరాటమో కానీ.. ఇలాంటి ఒక వింతైన కాన్సెప్ట్‌తో ఫోటో దిగాలనే ఆలోచన ఆ ఫోటోగ్రాఫర్‌కు ఎలా వచ్చిందో.. దానికి ఆ జంట ఎలా ఒప్పుకుందో అర్థం కాక నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు.
ప్రస్తుతం ఈ ఫోటో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది.. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ వింత ఫోటోకు ఇప్పటికే ఏకంగా 1 మిలియన్‌కు పైగా లైక్స్ రావడం విశేషం.. దీన్ని బట్టి చూస్తే.. సోషల్ మీడియాలో ఇలాంటి వింతలకు ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఫోటోను చూసి చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్స్ కూడా చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.




