
ఖమ్మం సభలో జనసేన అధికార ప్రతినిధి శ్రీనివాసరావు సభలో మాట్లాడుతున్న గడల శ్రీనివాసరావు ఖమ్మం సారథినగర్, న్యూస్‌టుడే: నీళ్లు, నిధులు, నియామకాలు ప్రధాన ఎజెండాగా గద్దెనెక్కిన భారాస, ఆచరణకు సాధ్యం కాని హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీలు ప్రజల ఆశలను వమ్ము చేశాయని జనసేన తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి గడల శ్రీనివాసరావు విమర్శించారు. ఈ రెండు పార్టీల వైఖరితో విసిగిపోయిన ప్రజలు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారని, జనసేన కూటమి ఈసారి ఎన్నికల్లో ప్రజా విశ్వాసాన్ని సొంతం చేసుకుంటుందని అన్నారు. ఖమ్మం నగరంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం శంఖారావం పేరిట రాష్ట్ర స్థాయి బహిరంగ సభ నిర్వహించారు. మొదట ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి సభా ప్రాంగణం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం గడల మాట్లాడుతూ.. నాడు దిశ కేసులో ఆడబిడ్డకు న్యాయం జరగాలని జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా చేసిన రేవంత్‌రెడ్డి.. నేడు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆదివాసీ బిడ్డ హత్యాచారానికి గురైతే స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఉద్యోగాల కోసం యువత, కొలువుల్లో ఇబ్బందులతో ప్రభుత్వ ఉద్యోగులు రోడ్డెక్కుతున్నారన్నారు.జనసేన నేత, సినీనటుడు తనీశ్‌ మాట్లాడుతూ ఆదివాసీ బిడ్డ చనిపోతే.. ఆ ఘటనను వదిలేసి ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్షం ఒకరిపై ఒకరు విమర్శలకు దిగుతూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





