
బంగారం కొనాలనుకుంటున్నారా..? అయితే శుభవార్త. గోల్డ్ రేట్లు మరింత తగ్గాయి. గత రెండు రోజులుగా కొనసాగుతున్న పెరుగుదలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు తగ్గడంతో.. దేశంలోనూ పతనమయ్యాయి. వారం ప్రారంభంలోనే బంగారం ధరలు కుప్పకూలడంతో కొనుగోలుదారులు ఊరట చెందుతున్నారు. భారతీయులకు బంగారమంటే ఎంత ఇష్టమని తెలిసిందే. గత కొన్ని రోజులుగా బంగారం ధరలలో ఊహించని మార్పులు కనిపిస్తున్నాయి. సోమవారం దేశీయ బులియన్ మార్కెట్లలో పసిడి ధరలు తగ్గడంతో వినియోగదారులు ఊపిరి పీల్చుకున్నారు. సెప్టెంబర్ 14న దేశంలోని వివిధ ప్రధాన నగారాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం.




