
Movie Profile
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

Movie Profile
సెల్‌ఫోన్లు పేలడంతో ఇద్దరు రైతులకు గాయాలు ఇందల్‌వాయి, బేల, గాంధారి - న్యూస్‌టుడే: రాష్ట్రంలోని పలుచోట్ల ఆదివారం పిడుగులు పడ్డాయి. ఈ ఘటనల్లో ఓ యువకుడు, మహిళ మృతిచెందగా, ఇద్దరు రైతులు తీవ్రంగా గాయపడ్డారు. నిజామాబాద్‌ జిల్లా ఇందల్‌వాయి మండలం దేవీతండాకు చెందిన బాదావత్‌ చరణ్‌ (18) పొలానికి వెళ్లి, తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో అతని సమీపంలో పిడుగు పడటంతో తీవ్ర గాయాలపాలయ్యారు. అతన్ని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. బాధితులను ఎద్దులబండిపై తరలిస్తున్న రైతులు ఆదిలాబాద్‌ జిల్లా బేల మండలంలోని అవాల్‌పూర్‌ గ్రామానికి చెందిన సోడెం సురేష్‌ తన భార్య లత (40)ను ఉదయం ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లి పత్తి పొలం వద్ద దించేశారు. ఆమె పొలం పనుల్లో ఉండగా మధ్యాహ్నం సమయంలో పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందారు. సాయంత్రం తల్లిని తీసుకొద్దామని పొలానికి వెళ్లిన ఆమె కుమారుడు విగతజీవిగా పడిఉన్న తల్లిని చూసి భోరున విలపించారు. వెంటనే తండ్రి, స్నేహితులకు సమాచారం అందించారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని బొప్పాజివాడకు చెందిన మేకల సూర్యకాంత్, బూర్గుల్‌కు చెందిన గైని శంకర్‌లు బొప్పాజివాడ శివారులోని పత్తి పంటలో మధ్యాహ్నం కలుపు తీస్తుండగా వర్షం రావడంతో ఇద్దరూ గొడుగు పట్టుకొని నిలబడ్డారు. అదే సమయంలో పిడుగు పడటంతో వారివద్ద ఉన్న సెల్‌ఫోన్లు పేలి స్పృహతప్పి పడిపోయారు. వెంటనే సమీపంలో ఉన్న రైతులు వారిని ఎడ్ల బండిపై రెండు కిలోమీటర్ల దూరంలోని గ్రామీణ రహదారి వరకు, అక్కడి నుంచి అంబులెన్స్‌లో గాంధారి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. తీవ్రంగా గాయపడిన రైతులను మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదే సమయంలో గాంధారిలో నిర్మాణంలో ఉన్న సేవాలాల్‌ ఆలయంపై పిడుగు పడటంతో ఆలయ గోపురం పాక్షికంగా దెబ్బతింది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: Eenadu లో చూడండి