
గాంధారి: యూరియా అడిగిన రైతును ఓ వ్యవసాయ అధికారి కఠిన పదజాలంతో దూషించారు. వివరాల్లోకి వెళితే.. గాంధారి మండలంలోని నర్సాపూర్ గ్రామానికి చెందిన సోమరిపేట రవి ఆదివారం రాత్రి 7:30 గంటలకు గాంధారి వ్యవసాయ అధికారి రాజలింగం చరవాణికి కాల్ చేశారు. యూరియా యాప్‌లో తన సర్వే నంబర్‌ను అప్రూవల్ చేయాలని కోరునందుకు ఏవో తనను కఠిన పదాలతో దూషించాడని రవి వాపోయారు. ఈ విషయంపై ‘న్యూస్‌టుడే’ గాంధారి మండలం వ్యవసాయ అధికారి రాజలింగంను చరవాణిలో సంప్రదించగా రైతు బీమా కోసం పదేపదే చరవాణికి కాల్ చేసి విసిగించాడని, మొదట ఆయన దూషించినందుకే నేను దూషించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. రైతును ఏవో బూతులు తిట్టిన ఆడియో రికార్డ్ మండలంలో వైరల్‌గా మారింది. ఈ విషయమై జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డిని సంప్రదించగా దీనిపై పూర్తిగా ఆరా తీసి చర్యలు తీసుకుంటామన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





