
భక్తిరస చిత్రంగా సంచలన విజయాన్ని సాధించిన 'హనుమాన్ అంశ్' సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రానికి తానే నిధులు సమకూర్చానంటూ వస్తు భక్తిరస చిత్రంగా సంచలన విజయాన్ని సాధించిన 'హనుమాన్ అంశ్' సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రానికి తానే నిధులు సమకూర్చానంటూ వస్తున్న ప్రచారంపై 21 ఏళ్ల యువ సహ నిర్మాత అనుప్రియ నాగర్ స్పందించారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం, ఈ చిత్రంలో తన పెట్టుబడులు మొత్తం పెట్టుబడిలో కేవలం మూడవ వంతు మాత్రమేనని, మొత్తం నిధులు తనవని అనుకుంటున్నది నిజం కాదని స్పష్టం చేశారు. ఈ సినిమా విజయాన్ని ఆమె అద్భుతంగా అభివర్ణించారు. యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ బాత్ నుంచి ఎకనామిక్స్‌లో పట్టభద్రురాలైన అనుప్రియ, ఈ ప్రాజెక్టులో చేరడం వెనుక ఉన్న కారణాలను వివరించారు. సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులకు నిధులు అవసరమైన దశలో ఆమె బృందంతో కలిశారు. యూకేలో చదువుకునే రోజుల్లో పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేసి సంపాదించిన పొదుపు మొత్తాన్ని ఈ సినిమా కోసం పెట్టుబడిగా పెట్టినట్లు అనుప్రియ వెల్లడించారు. అనుప్రియ మాట్లాడుతూ, "సినిమాకు కావాల్సిన మొత్తం డబ్బు నేనే ఇచ్చానని చాలామంది అనుకుంటున్నారు. కానీ, అది నిజం కాదు. మూడు విభిన్న తరాలకు చెందిన ముగ్గురు మహిళలు ఈ చిత్ర నిర్మాణంలో భాగం పంచుకున్నారు. వారిలో నేను చిన్నదాన్ని. మొత్తం పెట్టుబడిలో మూడో వంతు మాత్రమే నాది" అని తెలిపారు. ఈ ప్రాజెక్టులో చేరడం వెనుక బలమైన భావోద్వేగ కారణం ఉందని ఆమె వివరించారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలీ బాబా జీవిత కథ స్ఫూర్తితో దర్శకుడు విశాల్ చతుర్వేది ఈ సినిమాను తెరకెక్కించారు. నీమ్ కరోలీ బాబా అంటే తనకు ఎంతో భక్తి ఉందని, ఆయన కథలు భారతదేశంలో మరింత ఎక్కువ మందికి తెలియాలనే ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్టుకు ఆకర్షితురాలినయ్యానని ఆమె పేర్కొన్నారు.





