
Folk Artists Eshwar Sai | తెలుగు రాష్ట్రాల్లో గత కొంతకాలంగా సంచలనం సృష్టిస్తున్న జానపద కళాకారులు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వివాదం ఊహించని మలుపు తిరిగింది. పెళ్లి పేరుతో తనను మోసం చేశారంటూ సింగర్ మాధురి రాథోడ్ పోలీసులను ఆశ్రయించడం, దీనికి సంబంధించిన పరిణామాలు సోషల్ మీడియాలో రకరకాల చర్చలకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ వివాదం తారస్థాయికి చేరిన వేళ, ఈశ్వర్ సాయి భార్య శరణ్య తీవ్ర నిర్ణయం తీసుకోవడం కలకలం రేపింది. ఈ వివాదం నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన శరణ్య తాజాగా ఒక ఆడియో మెసేజ్‌ను విడుదల చేశారు. “నేను ఈ పోరాటంలో పూర్తిగా మోసపోయాను.. ఈశ్వర్ లేకపోతే నేను బతకలేను.. నా జీవితాన్ని పూర్తిగా ఆగమాగం చేశారు, అందుకే నాకు ఇదొక్కటే మార్గం కనిపిస్తోంది. ఈ ద్రోహాన్ని నేను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. దయచేసి నా కొడుకుని అందరూ కలిసి జాగ్రత్తగా చూసుకోండి” అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసిన వాయిస్ మెసేజ్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ పరిణామాల మధ్య తీవ్ర మనోవేదనతో శరణ్య బలవన్మరణానికి యత్నించినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆమెను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆమెకు అత్యవసర చికిత్స అందిస్తున్నారని, ఆమె ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని సమాచారం. జానపద కళాకారుల వ్యక్తిగత వివాదాలు కాస్తా ఒక నిండు ప్రాణం మీదికి రావడంతో అటు ఇండస్ట్రీలోనూ, ఇటు శ్రోతల్లోనూ తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఉదంతానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా, పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేసే అవకాశం ఉంది. ఈశ్వర్ లేకపోతే నేను బతకలేను బలవన్మరణానికి ప్రయత్నించిన ఈశ్వర్ సాయి భార్య శరణ్య నా కొడుకుని జాగ్రత్తగా చూసుకోండి నా జీవితాన్ని ఆగమాగం చేశారు.. నాకు ఇదొక్కటే మార్గం కనిపిస్తోంది ఈ ద్రోహాన్ని నేను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను అంటూ ఆడియో విడుదల… https://t.co/LYMjCGNmQL pic.twitter.com/AGersQ48SG — Telugu Scribe (@TeluguScribe) September 16, 2026





