
పంతొమ్మిదో శతాబ్దిలో భారతదేశంలో సంఘసంస్కరణలు, మతపరమైన సంస్కరణలు ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగాయి. ‘మత-సంఘ సంస్కరణోద్యమాలు’ అనే పేరుతో పంతొమ్మిదో శతాబ్ది పరిణామాలను కొందరు చరిత్రకారులు పేర్కొనగా, మరికొందరు ఈ పరిణామాలను ‘భారతీయ పునరుజ్జీవనం’ అని అభివర్ణించారు. నాటి భారతీయ సమాజంలో బానిసత్వ వ్యవస్థ కూడా ఉండేది. అధికారుల సంచార సంఘాలు ఈ దురాచారం గురించి పేర్కొన్నాయి. బానిసల నుదుటిపై కాల్చిన కడ్డీలతో ముద్ర వేసేవారు. పారిపోయి, పట్టుబడ్డ వారిని కొరడా దెబ్బలతో శిక్షించేవారు. సమాజంలో స్త్రీల స్థితిగతులు దయనీయంగా ఉండేవి. స్త్రీ ఎదుగుదలకు అనేక అవరోధాలు ఉండేవి. ఆనాడు స్త్రీ విద్య నిర్లక్ష్యానికి గురైంది. ‘సతి’ అనే దురాచారంలో చనిపోయిన భర్తతో పాటు భార్యను బతికి ఉండగానే చితిలో దహనం చేసేవారు. 19వ శతాబ్దానికి ముందు బెంగాల్, దేశంలో మత, సాంఘిక సంస్కరణోద్యమాలకు నాయకత్వం వహించినవారు - సంస్థలు, ముస్లిం సమాజంలో సంస్కరణ ఉద్యమాలు, నిమ్నజాతుల ఉద్యమాలు మొదలైన అంశాలు సహా పూర్తి సమాచారం ఈ-బుక్‌ రూపంలో ‘ఈనాడు ఈప్రతిభ జనరల్‌ స్టడీస్‌ ఈ-బుక్స్‌’ కోర్సులో అందుబాటులో ఉంది. మరిన్ని వివరాలకు క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి. .నెట్‌లో కనిపించే వ్యాపారరకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





