
కన్న కొడుకే ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఒత్తిడి చేస్తున్నాడంటూ ఓ వృద్ధ దంపతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వయస్సులో తామెక్కడికి వెళ్లాలి.. భార్య గుండె జబ్బుతో బాధపడుతోంది.. మాకు న్యాయం చేయండి.. అంటూ తమ ఇంటి ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ ఘటన శనివారం కరీంనగర్ కోతిరాంపూర్‌లో చర్చనీయాంశంగా మారింది. జమ్మికుంట మండలం వావిలాల గ్రామానికి చెందిన దేవులపల్లి లక్ష్మణ్ 2010లో ఉద్యోగ విరమణ పొందారు. ఆయనకు కుమారుడు రవికుమార్, కుమార్తె ఉన్నారు. రవికుమార్ హైదరాబాద్‌లో ఏరోస్పేస్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారని, నెలకు సుమారు రూ.8 లక్షల వేతనం పొందుతున్నారని దంపతులు తెలిపారు.