
ఎన్‌ఎస్‌ఈ షేరు ప్రతి రూ.10 పెరుగుదలపై రూ.40 కోట్ల లాభం నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) షేర్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీలో ఆకర్షణీయంగా లిస్ట్‌ అయితే.. డి-మార్ట్‌ అధిపతి రాధాకిషన్‌ దమానీకి లాభాల పంట పండుతుంది. ఇష్యూ ధర నుంచి, షేరు ధర ప్రతి రూ.10 పెరిగితే ఆయన పెట్టుబడి విలువకు అన్ని రూ.40 కోట్లు జత అవుతాయి. ఒకవేళ షేరు ధర రూ.10 తగ్గితే, రూ.40 కోట్ల చొప్పున ఆయన పెట్టుబడి విలువ తగ్గుతుంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ధమానీకి 1.58% వాటాకు సమానమైన 3.91 కోట్ల షేర్లు ఉన్నాయి. ఐపీఓ ధరల శ్రేణిలోని గరిష్ఠమైన రూ.1,785 ప్రకారం చూస్తే.. ఈ పెట్టుబడి విలువ సుమారు రూ.6,980 కోట్లు అవుతుంది. రూ.534 కోట్ల పెట్టుబడిపై రూ.16,501 కోట్ల లాభం: ఎన్‌ఎస్‌ఈ ఐపీఓలో తమ షేర్లను విక్రయిస్తున్న వాటాదార్లు గణనీయ లాభాలను ఆర్జించనున్నారు. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా షేర్లు విక్రయిస్తున్న ప్రస్తుత 10 మంది వాటాదార్లకే, రూ.17,035 కోట్లు లభించనున్నాయి. వీరు ఆ షేర్ల కొనుగోలు కోసం అప్పట్లో వెచ్చించిన మొత్తం సుమారు రూ.534 కోట్లు మాత్రమే. అంటే మొత్తంగా రూ.16,501 కోట్లు లాభం రానుందన్నమాట. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





