
అమృతలూరు: అమృతలూరు మండలంలోని మూల్పూరు గ్రామంలో చోరీ జరిగిన విషయంలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు, బాధితుడి కథనం ప్రకారం.. మండూరు సాంబశివరావు నాలుగేళ్లుగా తాడేపల్లిలో ఉంటున్నారు. గ్రామంలోని సొంత పొలాలను సాగుచేయడానికి రెండు రోజులకోసారి గ్రామానికి వచ్చి వెళ్తుంటారు. ఈ నెల 13న ఇంటికి రాగా చోరీ జరిగిన విషయం వెలుగుచూసింది. కింది పోర్షన్‌లో ఆయన అన్నయ్య కుటుంబం ఉంటుండగా, మొదటి అంతస్తులో సాంబశివరావు ఉంటున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తలుపులు, బీరువాలు పగలగొట్టి రూ.2.16 లక్షల నగదు, రూ.60 వేల విలువైన సుమారు 300 గ్రాముల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. అదే రోజు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఘటనా స్థలిని పరిశీలించి వివరాలు సేకరించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





